Tollywood: ‘మా’ దూకుడు.. మరో 18 ట్రోల్ చానల్స్ బ్లాక్… లిస్ట్ ఇదిగో

|

Jul 24, 2024 | 7:10 PM

సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వారి భరతంపడుతోంది మూమీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్. సినీ నటులను అడ్డగోలుగా ట్రోల్స్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్‌పై వేటు వేస్తోంది. ఆ డీటేల్స్ ఇప్పుడు తెలుసుకుందాం....

Tollywood: మా దూకుడు.. మరో 18 ట్రోల్ చానల్స్ బ్లాక్... లిస్ట్ ఇదిగో
Manchu Vishnu
Follow us on

సినీ నటులపై ట్రోల్స్ విషయంలో మూవీ ఆర్టిస్ట్స్ ఆసోసియేషన్ సీరియస్‌గా వ్యవహారిస్తోంది. యూట్యూబ్, ఇన్‌స్టా, ఎక్స్‌ వేదికగా ట్రోల్స్ చేస్తూ రెచ్చిపోతున్న వారి పట్ల దూకుడు ప్రదర్శిస్తోంది. లిమిట్స్‌ దాటిన ట్రోలర్స్‌ను టార్గెట్‌ చేస్తున్న వారిపై .. సినిమా వాళ్ల మీద డార్క్‌ కామెడీ చేస్తున్న ట్రోలర్స్‌ తాట తీస్తోంది. నటీనటులపై అసభ్యంగా దుష్రచారం చేస్తున్న 200 యూట్యూబ్‌ ఛానెల్స్‌ను గుర్తించి… డీజీపీకి కంప్లైంట్‌ చేసింది. 200 ఛానెళ్లకి సంబంధించిన వివరాలను డీజీపీకి రిపోర్ట్‌ చేశారు మూవీ అసోసియేషన్‌ ప్రతినిధులు. ఇప్పటికే 25 ఛానెల్స్‌ను యూట్యూబ్‌ సాయంతో డిలీట్‌ చేయించిన అసోసియేషన్‌… తాజాగా మరో 18 యూట్యూబ్‌ ఛానెల్స్‌పై వేటు వేసింది. ఈ ఛానళ్లను శాశ్వితంగా బ్యాన్‌ చేయించింది. సినీ నటులపై ట్రోల్స్‌ నడిపినందుకు గాను మా అసోసియేషన్ ఫిర్యాదుతో పోలీసుల చర్యలు తీసుకున్నారు. ఈ ఛానళ్లు సినిమా పరిశ్రమకు చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నాయని, అసత్య ప్రచారాలు, అభ్యంతరకరమైన కంటెంట్‌తో ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నాయని MAA ఆరోపించింది.

ట్రోల్స్‌ విషయంలో సైబర్ క్రైమ్‌లో ఒక వింగ్ ఏర్పాటు చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారు. పోలీసులతో సమన్వయం కోసం ఓ కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు MAA తెలిపింది. సినీ నటులపై అసభ్యకరమైన ట్రోల్స్‌ చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు మూవీ అసోసియేషన్‌ ప్రతినిధులు. ట్రోల్స్‌ చేసే వారిని టెర్రరిస్టులుగా పరిగణిస్తామన్నారు. నటీనటుల వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్లొద్దంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఇప్పటివరకూ మా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు మొత్తంగా 43 యూట్యూబ్ ఛానల్స్‌పై వేటు వేశారు. వీటి సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ లేకపోలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.