మంచి మనసు చాటుకున్న కరాటే కళ్యాణి.. పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న నటి

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో ఎంతోమందిని నవ్వించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీనియర్ నటి పావలా శ్యామల ఇక లేరు. సోమవారం 27 అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె భౌతికకాయాన్ని ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు

మంచి మనసు చాటుకున్న కరాటే కళ్యాణి.. పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న నటి
Pavala Shyamala

Updated on: Jul 28, 2026 | 11:29 AM

హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల గారు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రి సిబ్బంది మార్చురీలో భద్రపరిచారు. పావలా శ్యామల గారి కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో, అంత్యక్రియల నిర్వహణకు ‘మా’ (MAA) ముందుకు వచ్చింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పూర్తి సొంత ఖర్చులతో ఈ అంత్యక్రియలను నిర్వహించనుండగా, ప్రముఖ నటి కరాటే కళ్యాణి  ఈ అంతిమ సంస్కారాల పూర్తి బాధ్యతలను దగ్గరుండి చూసుకోనున్నట్లు తెలిపారు. ఈమేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు పావలా శ్యామల.

గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత (మంగళవారం) 1:52 గంటల సమయంలో ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించినట్లు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. కూతురి దీనస్థితి..పావలా శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో జీవన పోరాటం సాగిస్తున్నారు. ఆమెతో పాటే ఉన్న ఆమె కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఒకప్పుడు వెండితెరపై నవ్వులు పూయించిన నటి, చివరి రోజుల్లో ఇంతటి దయనీయ స్థితిలో కన్నుమూయడం చిత్ర పరిశ్రమను తీవ్రంగా కలచివేస్తోంది.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us