కాస్ట్ కటింగ్ పై క్రిష్ ఫోక‌స్..!

|

Jun 26, 2020 | 10:44 PM

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, ద‌ర్శ‌కుడు క్రిష్ కాంబోలో మూవీ అంటే ఓ రేంజులో అంచ‌నాలు ఉంటాయి. అందుకు త‌గ్గుట్టుగానే ఈ చిత్రానికి భారీ బ‌డ్జెట్ అనుకున్నారు నిర్మాతలు. కానీ క‌రోనా వ‌ల్ల ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

కాస్ట్ కటింగ్ పై క్రిష్ ఫోక‌స్..!
Follow us on

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, ద‌ర్శ‌కుడు క్రిష్ కాంబోలో మూవీ అంటే ఓ రేంజులో అంచ‌నాలు ఉంటాయి. అందుకు త‌గ్గుట్టుగానే ఈ చిత్రానికి భారీ బ‌డ్జెట్ అనుకున్నారు నిర్మాతలు. కానీ క‌రోనా వ‌ల్ల ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప‌వ‌న్ ఫిల్మ్ అయినా స‌రే కాస్ట క‌టింగ్ ఎక్క‌డ చేయెచ్చా అని ఆలోచిస్తున్నారు నిర్మాత‌లు. అయితే క‌థ ప‌రంగా, పోరాట స‌న్నివేశాల ప‌రంగా క్రిష్ రాజీ ప‌డ‌లేడ‌లేన‌ని చెప్పాడ‌ట‌. అందుకే సినిమా క‌థాంశాన్ని బ‌ట్టి డ్యూయెట్స్ త‌గ్గించే ప‌నిలో ఉంద‌ట యూనిట్. పాట‌ల‌కు భారీ సెట్స్ కూడా అవ‌స‌రం లేద‌ని భావిస్తున్నార‌ట‌. ప్రస్తుతం స్వ‌ర‌వాణి కీర‌వాణితో రెండు బ్యాక్ గ్రౌండ్ పాటలు మాత్ర‌మే ఫైన‌ల్ చేసిన‌ట్టు స‌మాచారం. ఆ త‌ర్వాత అవ‌స‌రాన్ని బ‌ట్టి పాటలు యాడ్ చేసే ఆలోచ‌న‌తో ఉన్నాడ‌ట క్రిష్‌. ఇప్ప‌టికే ప‌వ‌న్ కోసం స్పెష‌ల్ ఫ్లైట్ ఏర్పాటు చేసి భారీగా ఖ‌ర్చు పెట్టాడు నిర్మాత దిల్ రాజు. అందుకే ఆయ‌నపై ఎక్కువ భారం మోప‌కుండా క్రిష్ ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌.