Suriya: షూటింగ్‏లో గాయపడిన హీరో సూర్య.. సంచలన కామెంట్స్ చేసిన నిర్మాత..

|

Aug 09, 2024 | 7:39 PM

సూర్య 44 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన సూర్య బర్త్ డే గ్లింప్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో సూర్య గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల సూర్య తలకు గాయమైందంటూ కోలీవుడ్

Suriya: షూటింగ్‏లో గాయపడిన హీరో సూర్య.. సంచలన కామెంట్స్ చేసిన నిర్మాత..
Suriya
Follow us on

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు హీరో సూర్య. ప్రస్తుతం డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్య 44 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన సూర్య బర్త్ డే గ్లింప్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో సూర్య గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల సూర్య తలకు గాయమైందంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. దీంతో సూర్య అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.

తాజాగా ఆ వార్తలపై నిర్మాత రాజశేఖరన్ పాండియన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సూర్యకు స్వల్పంగా గాయమైందని తెలిపారు. కానీ ఇప్పటికే సూర్య కోలుకున్నారని.. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందొద్దంటూ విజ్ఞప్తి చేశారు. ప్రేమ, యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఇటీవల ఊటీలో ప్రారంభమైంది. అక్కడే ప్రమాదం జరగ్గా.. సూర్యను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో సూర్య సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. మరోవైపు ఈ హీరో నటించిన కంగువ మూవీ విడుదల కానుంది.

కంగువ చిత్రానికి డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ సినిమాపై మరింత అంచనాలు పెంచేశాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 10న విడుదల కానుంది. మరోవైపు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేయబోతున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.