Tollywood: రూ.450 కోట్లకు యజమాని ఈ సింగర్.. స్టార్ హీరోలకు ధీటుగా రెమ్యునరేషన్.. ఎవరంటే..

|

Aug 07, 2024 | 3:55 PM

సాధారణంగా సింగర్స్‌కి ఎంత క్రేజ్ ఉన్నా.. అంతగా ఆదాయం మాత్రం సంపాదించలేరు. కానీ తమ అద్భుతమైన గాత్రంతో ఎన్నో పాటలకు ప్రాణం పోస్తుంటారు. అలాగే హీరోలకు ధీటుగా ఫాలోయింగ్ సంపాదించుకుంటారు. పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొందరు సింగర్స్ మాత్రం అనేక విషయాలతో వార్తలలో నిలుస్తుంటారు.

Tollywood: రూ.450 కోట్లకు యజమాని ఈ సింగర్.. స్టార్ హీరోలకు ధీటుగా రెమ్యునరేషన్.. ఎవరంటే..
Singer
Follow us on

సాధారణంగా సింగర్స్‌కి ఎంత క్రేజ్ ఉన్నా.. అంతగా ఆదాయం మాత్రం సంపాదించలేరు. కానీ తమ అద్భుతమైన గాత్రంతో ఎన్నో పాటలకు ప్రాణం పోస్తుంటారు. అలాగే హీరోలకు ధీటుగా ఫాలోయింగ్ సంపాదించుకుంటారు. పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొందరు సింగర్స్ మాత్రం అనేక విషయాలతో వార్తలలో నిలుస్తుంటారు. ఇప్పుడు ఓ సింగర్ ఏకంగా రూ.450 కోట్లకు యజమాని. అయినా సింపుల్ లైఫ్ గడుపుతూ అందరికి ఆశ్చర్యం కలిగిస్తున్నాడు. ఇంతకీ అత్యధిక ఆస్తులు కలిగి ఉన్న ఆ సింగర్ ఎవరో తెలుసా..? అతడే బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్. భారతీయ గాయకులలో అరిజిత్ అత్యంత డిమాండ్ ఉన్న గాయకులలో ఒకరు. ముఖ్యంగా యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న సింగర్. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన పాటలతో శ్రోతలను మైమరపించాడు. అనేక సూపర్ హిట్ పాటలు అందించిన ఈ గాయకుడు చాలా సింపుల్ పర్సనాలిటీ ఉన్న సెలబ్రిటీ. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ గాయకుడు అతడే కావడం విశేషం.

హిందీలోనే కాకుండా తెలుగులోనూ అనేక పాటలు పాడి మనసులు దొచుకున్నాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక గాయకుడికి 10 లక్షలు చెల్లిస్తే, తెలుగు గాయకులకు అంత పెద్ద మొత్తంలో చెల్లించడం లేదని ముందు నుంచి వినిపిస్తున్న మాట. నిజానికి, బాలీవుడ్‌లోని అత్యంత ప్రసిద్ధ గాయకులకు మంచి వేతనం లభిస్తుంది. కానీ అర్జిత్ మాత్రం హీరోల కంటే ఈ సింగర్ ఎక్కువ డబ్బు సంపాదించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లోనే కాకుండా ఇతర సినీ పరిశ్రమల్లో కూడా ఎంతో మంది అభిమానులను కలిగి ఉన్న ఆయన ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడారు. గతేడాది విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీస్ డంకీ, జవాన్, యానిమల్ చిత్రాల్లో పాటలు పాడారు.

అరిజిత్ సింగ్‌ ఒక్కో పాటకు 20 లక్షల రూపాయల రెమ్యూనరేషన్‌ని అందుకుంటున్నారు. ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న గాయకుడు అరిజిత్ సింగ్. ఇప్పటివరకు అతడు మొత్తం రూ. 450 కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఇంత సంపద సంపాదించిన ఏకైక గాయకుడిగా అర్జిత్ సింగ్ పేరుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.