Tollywood: సౌత్ ఇండస్ట్రీలో పేర్లు మార్చుకున్న హీరోలు వీళ్లే.. చిరంజీవి నుంచి నాని వరకు.. ఎవరెవరంటే..

|

Jul 28, 2024 | 10:02 AM

మొదట్లో సినీ నటీనటులు తమ పేర్లను ఇండస్ట్రీ, సినిమాలకు తగినట్లుగా లేదా ఆకర్షణీయంగా కనిపించేందుకు మార్చుకునేవారు. కానీ ఇప్పుడు న్యూమారాలజీ.. ఆధ్యాత్మిక నమ్మకంపై తమ పేర్లలో మార్పులు చేసుకుంటున్నారు. సౌత్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోస్ నుంచి ఇప్పుడిప్పుడే సినీరంగంలోకి అడుగుపెడుతున్న యంగ్ హీరోస్ వరకు చాలా మంది తమ ఒరిజినల్ పేర్లను మార్చుకున్నారు. వాళ్లు ఎవరెవరో చూద్ధామా.

Tollywood: సౌత్ ఇండస్ట్రీలో పేర్లు మార్చుకున్న హీరోలు వీళ్లే.. చిరంజీవి నుంచి నాని వరకు.. ఎవరెవరంటే..
Chiranjeevi, Rajinikanth, P
Follow us on

సినీ పరిశ్రమలో పేరు మార్పులు కొత్తేమి కాదు.. కానీ అందుకు కారణాలు మాత్రం చాలా ఉంటాయి. మొదట్లో సినీ నటీనటులు తమ పేర్లను ఇండస్ట్రీ, సినిమాలకు తగినట్లుగా లేదా ఆకర్షణీయంగా కనిపించేందుకు మార్చుకునేవారు. కానీ ఇప్పుడు న్యూమారాలజీ.. ఆధ్యాత్మిక నమ్మకంపై తమ పేర్లలో మార్పులు చేసుకుంటున్నారు. సౌత్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోస్ నుంచి ఇప్పుడిప్పుడే సినీరంగంలోకి అడుగుపెడుతున్న యంగ్ హీరోస్ వరకు చాలా మంది తమ ఒరిజినల్ పేర్లను మార్చుకున్నారు. వాళ్లు ఎవరెవరో చూద్ధామా.

రజినీకాంత్..
భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో. సూపర్ స్టార్ రజినీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సాధారణ బస్ కండక్టర్ నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సూపర్ స్టార్ గా ఎదిగారు. రజినీకాంత్ అసలు పేరు శివాజీ గైక్వాడ్. కానీ సినిమాల్లోకి వచ్చాక రజినీకాంత్ గా మార్చుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు శివశంకర వర ప్రసాద్. కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన చిరు.. ఆ తర్వాత హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చాక తన పేరును చిరంజీవిగా మార్చుకున్నారు.

పవన్ కళ్యాణ్..
ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ బాబు. కానీ సినిమాల్లోకి వచ్చాక తన పేరును పవన్ కళ్యాణ్ గా మార్చుకున్నారు. ఇప్పుడు పవర్ స్టార్ అంటే ఒక బ్రాండ్ అన్న స్థాయికి ఎదిగారు.

రవితేజ..
మాస్ మాహారాజా రవితేజ అసలు పేరు రవిశంకర్ రాజు. తన పేరును రవితేజగా మార్చుకున్నాడు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇడియట్ సినిమా రవితేజ కెరీర్ ను మలుపు తిప్పింది.

నాని..
నాని అసలు పేరు నవీన్ బాబు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి అష్టా చెమ్మా సినిమాతో హీరోగా మారాడు. ఇప్పుడు న్యాచురల్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు.

సాయి ధరమ్ తేజ్..
మెగా కంపౌండ్ నుంచి హీరోగా అడుగుపెట్టిన సాయి ధరమ్ తేజ్.. ఇటీవలే తన పేరును మార్చుకున్నాడు. తన తల్లి పేరును తన పేరుతో సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్నాడు.

అడివి శేష్..
టాలెంటెడ్ హీరో అడివి శేష్ అసలు పేరు సన్నీ చంద్ర. కానీ ఇండస్ట్రీలోకి వచ్చాక తన పేరును మార్చుకున్నాడు.

విశ్వక్ సేన్..
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అసలు పేరు దినేష్ నాయుడు. విలక్షణమైన నటనతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

ఆకాష్ జగన్నాథ్..
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ఇప్పుడిప్పుడే హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా తన పేరును ఆకాష్ జగన్నాధ్‌గా మార్చుకున్నాడు.

జగపతి బాబు..
విలక్షణ నటుడు జగపతి బాబు ప్రస్తుతం సహాయ నటుడిగా, విలన్ పాత్రలతో మెప్పిస్తున్నాడు. ఆయన అసలు పేరు జగపతి రావు చౌదరి. తన పేరును జగపతి బాబుగా మార్చుకున్నాడు.