Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు తీసుకున్న హీరోయిన్.. ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే తార ఆమెనే..

|

Jul 17, 2024 | 2:16 PM

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక్క సినిమాకు రూ. 40 కోట్లు వసూలు చేస్తుంది. బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోయిన్స్ అందరి కంటే ఎక్కువగా పారితోషికం తీసుకుంటున్న ఆ అందాల రాశికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన ఈ తార.. ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.

Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు తీసుకున్న హీరోయిన్.. ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే తార ఆమెనే..
Actress
Follow us on

సాధారణంగా భారతీయ సినీ పరిశ్రమలో స్టార్ హీరోస్ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. సినీ నిర్మాణంలో ఎక్కువ శాతం స్టార్స్ రెమ్యునరేషన్స్ అవుతున్నాయని.. కానీ హీరోయిన్స్‏కు అతి తక్కువ పారితోషికం ఉంటుందని ఇదివరకు చాలా మంది తారలు కామెంట్స్ చేశారు. కానీ ఓ హీరోయిన్ మాత్రమే స్టార్ హీరోలకు సమానంగా రెమ్యురనేషన్ తీసుకుంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక్క సినిమాకు రూ. 40 కోట్లు వసూలు చేస్తుంది. బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోయిన్స్ అందరి కంటే ఎక్కువగా పారితోషికం తీసుకుంటున్న ఆ అందాల రాశికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన ఈ తార.. ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.

ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో టాప్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది. ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం.. ప్రియాంక చోప్రా ఒక్క సినిమాకు రూ.40 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. అయితే ఈ రెమ్యునరేషన్ అనేది కేవలం హాలీవుడ్ సినిమాలకు మాత్రమే తీసుకుంటున్నట్లు సమచారం. ఇప్పుడు హాలీవుడ్ లో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ప్రియాంక ఒక్క మూవీకి 5 మిలియన్ డాలర్స్.. అంటే భారతీయ కరెన్సీలో రూ.40 కోట్లు తీసుకుంటుందట. ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సిటాడెల్ సిరీస్ కోసం ప్రియాంక భారీ పారితోషికాన్ని అందుకుంది.

అంతకు ముందు హిందీలో ప్రతి సినిమాకు రూ.14 నుంచి రూ.20 కోట్లు వరకు పారితోషికం తీసుకుంది. కానీ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ దీపికా పదుకొణే. ఒక్క సినిమాకు రూ.15 నుంచి రూ.30 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. బర్ఫీ, మేరీకోమ్, బాజీరావ్ మస్తానీ, దిల్ ధడక్నే దో వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రియాంక.. అమెరికన్ సింగ్ర నిక్ జోనాస్ తో వివాహం తర్వాత లాస్ ఏంజెల్స్ లో సెటిల్ అయ్యింది. 2017లో బేవాచ్ చిత్రం హాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఎ కిడ్ లైక్ జేక్, ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్, వి కెన్ బి హీరోస్, ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్, లవ్ ఎగైన్ వంటి చిత్రాల్లో నటించింది. త్వరలోనే ప్రియాంక మరోసారి హిందీలో సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.