Devara-Janhvi Kapoor: ‘దేవర’ కోసం జాన్వీ కపూర్ దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. ఎంతంటే..

|

Sep 17, 2024 | 1:54 PM

ఇటీవలే ముంబైలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా అక్కడి మీడియాతో ముచ్చటించారు ఎన్టీఆర్. ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, హీరోయిన్ అలియా భట్ తో కలిసి పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఇక ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తారక్.. చిత్రబృందంతో కలిసి ప్రత్యేక ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే..

Devara-Janhvi Kapoor: దేవర కోసం జాన్వీ కపూర్ దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. ఎంతంటే..
Janhvi Kapoor
Follow us on

ప్రస్తుతం ఎక్కడ చూసిన దేవర సినిమా పేరే వినిపిస్తోంది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ మూవీపై ఓ రేంజ్ అంచనాలు పెంచేసింది. ఇక సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో కొన్నిరోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ చేస్తుంది చిత్రయూనిట్. ఇటీవలే ముంబైలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా అక్కడి మీడియాతో ముచ్చటించారు ఎన్టీఆర్. ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, హీరోయిన్ అలియా భట్ తో కలిసి పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఇక ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తారక్.. చిత్రబృందంతో కలిసి ప్రత్యేక ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈసినిమాతోనే మొదటి సారి తెలుగు అడియన్స్ ముందుకు రాబోతుంది జాన్వీ కపూర్.

ఇన్నాళ్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న జాన్వీ.. ఇప్పుడు తొలిసారి ఎన్టీఆర్ సరసన నటిస్తుండడంతో ఈ మూవీని చూసేందుకు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ మూవీ విడుదల కాకముందే మరో ఆఫర్స్ అందుకున్న సంగతి తెలిసిందే. దేవర సినిమాతోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబోలో రాబోతున్న ఆర్సీ 16లోనూ ఎంపికైంది. ఇదంతా పక్కన పెడితే దేవర సినిమా కోసం జాన్వీ తీసుకుంటున్న రెమ్యునరేషన్ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

లేటేస్ట్ టాక్ ప్రకారం దేవర సినిమా కోసం జాన్వీ కపూర్ రూ.5 కోట్లు తీసుకుందని సమాచారం. సౌత్ ఇండస్ట్రీలో జాన్వీకి ఇది మొదటి సినిమా. నిజానికి జాన్వీ హిందీలో ఒక్కో సినిమా కోసం రూ.4 కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. ఇక ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రాజెక్ట్ కోసం ఈ బ్యూటీ ఏకంగా రూ.5 కోట్లు పారితోషికం తీసుకుంటుందట. అలాగే దేవర సినిమా కోసం తారక్ రూ.60 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడని టాక్. గతంలో ట్రిపుల్ ఆర్ మూవీ కోసం రూ.45 కోట్లు తీసుకున్నాడట.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.