Tollywood: ఆర్మీలో చేరాల్సిన అమ్మాయి ఇండస్ట్రీలో గ్లామర్ బ్యూటీగా మారింది.. ఫాలోయింగ్ మాత్రం బీభత్సం..

|

Jun 30, 2024 | 11:14 AM

గత తొమ్మిదేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఓ హీరోయిన్ మాత్రం విజయం సాధించలేకపోయింది. చిన్నప్పటి నుంచి ఆర్మీలో చేరాలని, దేశానికి సేవ చేయడమే తనకు ఇష్టమని చెప్పిన అమ్మాయి.. అనుహ్యంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో చిత్రాల్లో నటించిన ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయింది.

Tollywood: ఆర్మీలో చేరాల్సిన అమ్మాయి ఇండస్ట్రీలో గ్లామర్ బ్యూటీగా మారింది.. ఫాలోయింగ్ మాత్రం బీభత్సం..
Actress 1
Follow us on

సినీ రంగుల ప్రపంచంలో ఎంతో మంది నటీనటులుగా గుర్తింపు కోసం ప్రయత్ని్స్తుంటారు. ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకోవాలని.. తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకునేవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ ఈ సినీ పరిశ్రమలో అందం, అభియనమే కాదు.. ముఖ్యంగా అదృష్టం కూడా ఉండాలి. లక్ లేకపోతే టాలెంట్ ఉన్నా కలిసిరావడం అనేది చాలా కష్టం. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఒక్క సినిమా హిట్టు పడితే కెరీర్ ఒక్కసారిగా మారిపోతుంది. కానీ గత తొమ్మిదేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఓ హీరోయిన్ మాత్రం విజయం సాధించలేకపోయింది. చిన్నప్పటి నుంచి ఆర్మీలో చేరాలని, దేశానికి సేవ చేయడమే తనకు ఇష్టమని చెప్పిన అమ్మాయి.. అనుహ్యంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో చిత్రాల్లో నటించిన ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయింది. దీంతో కెరీర్ కు గుడ్ బై చెప్పేసింది. తనే బాలీవుడ్ బ్యూటీ సెలీనా జైట్లీ. ఈ పేరు చాలా మంది తెలియదు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. తెలుగులో మాత్రం ఒక్క సినిమానే చేసింది. అదే మంచు విష్ణు హీరోగా నటించిన సూర్యం. 2004లో విడుదలైన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. సెలీనా జైట్లీ తండ్రి ఆర్మీలో కల్నల్. దీంతో చిన్నప్పటి నుంచే దేశానికి సేవ చేయాలని అనుకుందట. కానీ ఆ తర్వాత గ్రాడ్యూయేషన్ కంప్లీట్ కాగానే నటన వైపు ఆసక్తి కలగడంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. జైరా వాసిమ్, గాయత్రి జోషి, నమ్రతా శిరోద్కర్ వంటి స్టార్స్ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతునన సమయంలో నటిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది. తండ్రి ఆర్మీలో కల్నల్ కాగా.. తల్లి ఆర్మీలో నర్సుగా పనిచేసింది. పెద్దయ్యక తన తండ్రిలాగే ఆర్మీలో చేరాలనుకుంది. లేదా డాక్టర్ గా దేశానికి సేవ చేయాలని అనుకుంది. కానీ కామర్స్ పట్టా పొందిన తర్వాత సెల్ ఫోన్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేసింది. 16 ఏళ్ల వయసులోనే మోడలింగ్ స్టార్ట్ చేసింది. ఫెమినా మిస్ ఇండియా 2001 టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత రెండేళ్ళకు జాన్ షీన్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది.

హిందీలో అనేక చిత్రాల్లో నటించిన సెలీనా.. తన 9 ఏళ్ల సుధీర్ఘ కెరీర్ లో ఒక్క హిట్టు కూడా అందుకోలేదు. తొమ్మిది సంవత్సరాలలో మొత్తం 13 చిత్రాల్లో నటించినా ఒక్క మూవీ హిట్ కాలేదు. విల్ యు మ్యారీ మి సినిమాలో చివరగా కనిపించింది. హిందీలో అనేక సినిమాలు చేసిన సెలీనా తెలుగులో సూర్యం సినిమాలో కనిపించింది. ఈ మ్యూవీ కూడా హిట్ కాలేదు. ఆ తర్వాత ఆస్ట్రియన్ వ్యాపారవేత్త పీటర్ హాగ్ ను వివాహం చేసుకుంది. వీరికి 2012లో కవలలు జన్మించారు. 2017లో మరోసారి కవలలు జన్మించారు. అయితే ఈ కవలలో ఓ చిన్నారి గుండె జబ్బుతో మృతి చెందింది. ప్రస్తుతం దుబాయ్ లో సెటిల్ అయిన సెలీనా 2020లో సీజన్ గ్రీటింగ్స్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.