Fahad Faazil – Nazriya Nazim: ఆమెకు 19, అతడికి 32, ఇద్దరి మధ్య 13 ఏళ్ల వ్యత్యాసం.. పుష్ప విలన్ లవ్ స్టోరీ తెలుసా..?

|

Aug 08, 2024 | 2:28 PM

మలయాళంలో ఫహాద్ నటించిన సినిమాలన్ని తెలుగులోకి డబ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే అటు నిర్మాతగానూ కొనసాగుతున్నాడు. ఈరోజు ఆగస్టు 8వ తేదీన ఫహద్ ఫాసిల్ పుట్టినరోజు.

Fahad Faazil - Nazriya Nazim: ఆమెకు 19, అతడికి 32, ఇద్దరి మధ్య 13 ఏళ్ల వ్యత్యాసం.. పుష్ప విలన్ లవ్ స్టోరీ తెలుసా..?
Fahad Faazil
Follow us on

అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించాడు. ఈ మూవీ తర్వాత మలయాళంలో ఫహాద్ నటించిన సినిమాలన్ని తెలుగులోకి డబ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే అటు నిర్మాతగానూ కొనసాగుతున్నాడు. ఈరోజు ఆగస్టు 8వ తేదీన ఫహద్ ఫాసిల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రముఖ దర్శకుడు ఫాజిల్ తనయుడు ఫహద్. ఫహద్‌కి చిన్నప్పటి నుంచి యాక్టర్‌ కావాలనే కోరిక ఉండేది. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫహాద్.. జాతీయ అవార్డు, కేరళ రాష్ట్ర అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నాడు.

ఫహద్ ఫాసిల్ తన తండ్రి ద్వారా 2002లో సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. మొదటి సినిమా అంతగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి 2010లో సినిమా రంగంలోకి రీఎంట్రీ ఇచ్చాడు ఫహద్ ఫాసిల్. 2011లో ‘చప్పా కురిశు’ సినిమాలో నటనకు గానూ రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. 2014లోనే ప్రొడక్షన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ‘జోజి’, ‘ప్రేమలు’ వంటి చిత్రాలను నిర్మించారు. ఇటీవల విడుదలైన ‘ప్రేమలు’ సినిమా భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

హీరో అంటే సిక్స్ ప్యాక్, లుక్స్ ముఖ్యం కాదు నటనే ముఖ్యం అని నిరూపించాడు. తక్కువ సమయంలోనే మాలీవుడ్‌లో స్టార్ హీరోగా మారాడు. ఫహద్ సినిమాలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. ’22 ఫిమేల్ కొట్టాయం’, ‘డైమండ్ నెక్లెస్’, ఆమెన్, ‘జోజి’, ‘మాలిక్’, ‘ట్రాన్స్’, ‘విక్రమ్’, పుష్ప’ వంటి సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫహద్ ఫాసిల్ మాలీవుడ్ నటి నజ్రియా నజీమ్‌ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య వయసులో చాలా వ్యత్యాసం ఉంది. ఫహద్ 32 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు నజ్రియా వయసు 19. అంటే వారి మధ్య దాదాపు 13 ఏళ్ల గ్యాప్ ఉందన్నమాట. వారు 2014లో వివాహం చేసుకున్నారు.

వీరిద్దరు కలిసి ‘బెంగళూరు డేస్’ సినిమాలో నటించారు. ఫహద్ ఫాసిల్ గ్యారేజీలో చాలా లగ్జరీ కార్లు వచ్చాయి. పోర్షా 911 కారెరా ఎస్ ఉంది. భారతదేశంలో ఈ మోడల్ కారు ధర రూ.1.84 కోట్లు. అలాగే అతడి వద్ద Mercedes Benz E క్లాస్, రేంజ్ రోవర్ వోగ్ ఉన్నాయి. 2019లో, ఫహద్ కొచ్చిలో ఒక విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశాడు. ఈ ఇంటి విలువ కోటి రూపాయలు. ఫహద్ ఆస్తి 35 కోట్ల రూపాయలు. ఒక్కో సినిమాకు 3.5 కోట్లు తీసుకుంటాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.