క్షమాపణ చెప్పను.. నా సినిమాను కర్ణాటకలో రిలీజ్ చేయను.. తగ్గేదే లే అంటున్న కమల్ హాసన్

కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల వల్ల థగ్ లైఫ్ సినిమా వివాదంలో చిక్కున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో ఈ సినిమాపై ఇప్పటికే నిషేదం విధించారు. తమ హెచ్చరికలు కాదని ఎవరైనా సినిమా ప్రదర్శిస్తే థియేటర్లు కాల్చేస్తామని హెచ్చరించారు. మరోవైపు తాను ఎలాంటి తప్పు చేయలేదని.. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని వాదిస్తున్నారు కమల్.

క్షమాపణ చెప్పను.. నా సినిమాను కర్ణాటకలో రిలీజ్ చేయను.. తగ్గేదే లే అంటున్న కమల్ హాసన్
Kamal Haasan

Updated on: Jun 03, 2025 | 3:23 PM

కమల్ హాసన్ పై కన్నడ ప్రజలు మండిపడుతున్నారు. కమల్ హాసన్ , మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శింబు కూడా నటిస్తున్నారు. రిలీజ్ దగ్గర పడటంతో ఈ సినిమా ప్రమోషన్స్ పనిలో ఉంది చిత్ర యూనిట్. పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో కమల్ హాసన్ మాట్లాడుతూ.. కన్నడ భాషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో థగ్ లైఫ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో, కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, “కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది” అని కమల్ హాసన్ అన్నారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో ఆగ్రహాన్ని రేకెత్తించాయి, కన్నడిగులు దీనిని తమ భాషా గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యగా భావించారు.

కమల్ హాసన్ తన ప్రసంగంలో, “నా జీవితం, నా కుటుంబం తమిళం. శివరాజ్ కుమార్ వేరే రాష్ట్రంలో ఉన్నా నా కుటుంబ సభ్యుడే. కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది” అని చెప్పారు. కమల్ హాసన్ వ్యాఖ్యల పై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తన వ్యాఖ్యలను కమల్ సమర్ధించుకోవడంతో కన్నడిగులు ఆగ్రహం మరింత ఎక్కువైంది. కర్ణాటకలో కన్నడ సంఘాలు, అభిమానులు నిరసనలు చేపట్టారు. థగ్ లైఫ్ సినిమా బ్యానర్లను చించివేయడం, కమల్ దిష్టిబొమ్మలను దహనం చేయడం వంటి సంఘటనలు జరిగాయి.

కమల్ హాసన్ మే 30, 2025లోగా క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో విడుదల చేయడాన్ని నిషేధిస్తామని KFCC హెచ్చరించింది. కమల్‌ హాసన్‌పై కర్నాటక హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినప్పటికి సారీ చెప్పడానికి కమల్‌ నిరాకరించారు. ” నేను తప్పుగా మాట్లాడలేదు.. క్షమాపణ చెప్పను.. థగ్‌ లైఫ్‌ సినిమాను కర్నాటకలో విడుదల చేయడం లేదు” అని కమల్ అన్నారు. థగ్‌ లైఫ్‌ సినిమా విడుదలపై హైకోర్టులో కమల్‌ పిటిషన్‌ దాఖలైంది.  తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని ఎలా అంటారు ?  మీరు చరిత్రకారులా ? అని కమల్‌ను ప్రశ్నించింది హైకోర్టు. అలాగే క్షమాపణ చెబితే వివాదం సమసిపోతుందని హైకోర్టు తెలిపింది. అటు కమల్‌ హాసన్‌ క్షమాపణ చెప్పాలని కర్నాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ కూడా డిమాండ్ చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us