Janhvi Kapoor: జూనియర్ శ్రీదేవి కోసం పోటి పడుతున్న ఇద్దరు టాలీవుడ్ స్టార్స్.. ఎవరంటే..?

|

Dec 02, 2022 | 1:01 PM

ఎన్టీఆర్ అయితే నటించేందుకు ఆల్వేష్ రెడీ అన్న బ్యూటీ.. చరణ్‌ పక్కన సైతం సై అంటారా..? లేదు.. లేదు అలా కాదు అనేస్తారా..? లెట్స్ వెయిట్ అండ్ సీ.

Janhvi Kapoor: జూనియర్ శ్రీదేవి కోసం పోటి పడుతున్న ఇద్దరు టాలీవుడ్ స్టార్స్.. ఎవరంటే..?
Janhvi Kapoor
Follow us on

నారి నారి నడుమ మురారి అంటారు కామన్‌గా అయితే.. కానీ ఇండస్ట్రీలో మాత్రం ఓ నారి ఇద్దరు మురారుల మధ్య ఇరుక్కుపోయింది. టాలీవుడ్ టాప్ స్టార్స్ ఇద్దరూ ఆమె కోసం పోటీ పడుతున్నారు. కానీ ఆ నారి మాత్రం ఏ మురారితో రొమాన్స్ చేస్తుందనేది సస్పెన్స్‌గా మారిపోయింది. మరి ఆ నారి ఎవరు.. ఆమెను రౌండప్ చేసిన మురారులు ఎవరో తెలుసుకుందాం పదండి.  టాలీవుడ్‌లో ఓ హీరోయిన్ గురించి ఇద్దరు హీరోలు పోటీ పడటం అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు జాన్వీ కపూర్ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య అలాంటి పోటీ ఉంది. ఈ తలనొప్పి హీరోలకు కాదు.. జాన్వీ కపూర్‌కే ఎక్కువగా ఉంది. ఎవరికి ఓకే చెప్పాలి.. ఎవరితో నటించాలనే కన్ఫ్యూజన్‌లో కొన్ని నెలలు గడిచిపోతున్నాయి. మంచి కథ వస్తే టాలీవుడ్‌కు వస్తానని చెప్పిన జాన్వీకి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది.

చాలా రోజులుగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు జాన్వీ కపూర్. సరైన కథ కోసం వేచి చూస్తున్నారు. నిజానికి పూరీ జగన్నాథ్ లైగర్‌లో ముందు జాన్వీని హీరోయిన్‌గా ఎంచుకున్నారు. కానీ ఆమెకు కథ నచ్చకపోవడంతో ఒప్పుకోలేదు. ఆ తర్వాత మరో రెండు మూడు ఆఫర్స్‌ వచ్చినా నో చెప్పారు జాన్వీ. అయితే ఎన్టీఆర్, బుచ్చిబాబు సినిమాలో ఈమెను హీరోయిన్‌గా అనుకున్నారు.

తనకు ఎన్టీఆర్‌తో నటించాలని ఉందని.. ఆ ఛాన్స్ వస్తే వదులుకోనని చెప్పారు జాన్వీ. తాజాగా బుచ్చిబాబు అదే సినిమాను చరణ్‌తో అనౌన్స్ చేసారు. ఎన్టీఆర్‌తో అయితే ఓకే అన్న బ్యూటీ.. చరణ్‌కు ఓకే చెప్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. జగదేకవీరుడు అతిలోకసుందరి రీమేక్‌లో చరణ్, జాన్వీ నటిస్తే బాగుంటుందని ఎప్పట్నుంచో వార్తలున్నాయి. మరి జాన్వీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలిక.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.