చెఫ్, టీచ‌ర్..కుమారుల‌కు అంతా తానే అయిన రామారావు..!

| Edited By:

Jun 17, 2020 | 4:53 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్..న‌ట‌న గురించి ప్ర‌పంచానికి తెలుసు. కెమెరా క‌న‌బ‌డితే చెల‌రేగిపోవ‌డం అత‌డికి వెన్న‌తో పెట్టిన విద్య‌. ప్రస్తుతం ప్ర‌భుత్వం ప‌ర్మిష‌న్స్ ఇవ్వ‌డంతో చిన్న తార‌కరాముడు ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కోసం సన్నద్ధమవుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఎంతో బిజీగా ఉండే ఎన్టీఆర్ కి మూడు నెలల పాటు పిల్ల‌ల‌తో ఆనందంగా గ‌డ‌ప‌డానికి స‌మ‌యం దొరికింది. త‌న కిడ్స్ తో కూడా విలువైన స‌మయాన్ని గ‌డుపుతున్నాడు తార‌క్. ఇక ఎన్టీఆర్ వంట కూడా బాగా చేస్తార‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. […]

చెఫ్, టీచ‌ర్..కుమారుల‌కు అంతా తానే అయిన రామారావు..!
Follow us on

యంగ్ టైగర్ ఎన్టీఆర్..న‌ట‌న గురించి ప్ర‌పంచానికి తెలుసు. కెమెరా క‌న‌బ‌డితే చెల‌రేగిపోవ‌డం అత‌డికి వెన్న‌తో పెట్టిన విద్య‌. ప్రస్తుతం ప్ర‌భుత్వం ప‌ర్మిష‌న్స్ ఇవ్వ‌డంతో చిన్న తార‌కరాముడు ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కోసం సన్నద్ధమవుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఎంతో బిజీగా ఉండే ఎన్టీఆర్ కి మూడు నెలల పాటు పిల్ల‌ల‌తో ఆనందంగా గ‌డ‌ప‌డానికి స‌మ‌యం దొరికింది. త‌న కిడ్స్ తో కూడా విలువైన స‌మయాన్ని గ‌డుపుతున్నాడు తార‌క్. ఇక ఎన్టీఆర్ వంట కూడా బాగా చేస్తార‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కరోనా నేప‌థ్యంలో ప‌ని మనుషులు కూడా ఆగిపోవ‌డంతో.. తన కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ కోసం ఎన్టీఆర్ చెఫ్ గా మారార‌ట‌. వారి కోసం వంటకాల చేసి పెట్టార‌ట‌. చాలా సంవత్సరాల తర్వాత కొత్త వంట‌కాలు ప్రయత్నించాడు తారక్. ఆ వంటలు త‌న శ్రీమ‌తికి, త‌ల్లికి  బాగా న‌చ్చేశాయ‌ట‌.

ఇక‌ తన ఇద్దరు కొడుకుల‌ కోసం ఎన్టీఆర్ తెలుగు టీచర్‌గా కూడా మారారని తెలుస్తోంది. ప్రస్తుతం సెలబ్రిటీల పిల్లలందరూ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకే ప‌ర‌మిత‌మ‌వుతున్నారు. వారికి ఇంగ్లీషే ఎక్కువ అల‌వాటు అవుతోంది.  అందుకే, తన పిల్లలకు తెలుగు భాషపై మ‌క్కువ పెర‌గేలా పాఠాలు కూడా చెబుతున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ లో తెగ చెక్క‌ర్లు కొడుతోంది.