Janhvi Kapoor: నా గురించి అలాంటి కామెంట్స్ చేస్తున్నారు.. రూమర్స్ పై స్పందించిన జాన్వీ కపూర్..

|

Jul 26, 2024 | 12:46 PM

ఇదిలా ఉంటే.. కొన్ని రోజులుగా జాన్వీ కపూర్ కు సంబంధించి ఏదోక న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆమె ఎంచుకునే సినిమాల దగ్గర్నుంచి.. ప్రశంసలు... పర్సనల్ లైఫ్ ఇలా ప్రతి విషయం క్షణాల్లో నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలను ఎంచుకుంటూ ప్రశంసలు అందుకుంటున్న జాన్వీ.. డబ్బులిచ్చి మరీ తనను పొగిడించుకుంటోందని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

Janhvi Kapoor: నా గురించి అలాంటి కామెంట్స్ చేస్తున్నారు.. రూమర్స్ పై స్పందించిన జాన్వీ కపూర్..
Janhvi Kapoor
Follow us on

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరు. హిందీ, తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, యాక్షన్, మెసేజ్ తరహా చిత్రాల్లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రంలో నటిస్తుంది. అలాగే తెలుగులో ఆర్సీ 16, నాని కొత్త సినిమాల్లోనూ నటించనుంది. ఇటు తెలుగులో సినిమాలకు ఒకే చేస్తూనే మరోవైపు హిందీలోనూ ఆఫర్స్ అందుకుంటుంది. అలాగే కొన్నిరోజుల క్రితం జరిగిన అనంత్ అంబానీ పెళ్లి వేడుకలలోనూ సందడి చేసింది. ఇదిలా ఉంటే.. కొన్ని రోజులుగా జాన్వీ కపూర్ కు సంబంధించి ఏదోక న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆమె ఎంచుకునే సినిమాల దగ్గర్నుంచి.. ప్రశంసలు… పర్సనల్ లైఫ్ ఇలా ప్రతి విషయం క్షణాల్లో నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలను ఎంచుకుంటూ ప్రశంసలు అందుకుంటున్న జాన్వీ.. డబ్బులిచ్చి మరీ తనను పొగిడించుకుంటోందని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

నటన గురించి కాకుండా కొందరికి ఆమె ప్రత్యేకంగా డబ్బులిచ్చి మరీ తనను పొగిడించుకుంటుందని కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఉలఝ్ ప్రమోషన్లలో పాల్గొన్న జాన్వీ కపూర్.. తన గురించి నడుస్తున్న ప్రచారం పై స్పందించింది. “నేను మీ అందరి ముందు కూర్చుని నా గురించి ఏమని చెప్పుకోవాలి.. నాపై నాకు చాలా నమ్మకముంది. అద్భుతంగా నటిస్తున్నానని చెప్పాలా..? అలా సొంత డబ్బు కొట్టుకోవడం నా వల్ల కాదు.. నా గురించి జనాలు మాత్రమే జడ్జ్ చేయాలి. నా యాక్టింగ్ గురించి ప్రేక్షకులే చెప్పాలి.

కానీ ఎవరైనా సోషల్ మీడియాలో నన్ను పొరపాటున పొగిడితే వాళ్లకు నేను డబ్బులిస్తున్నానని అంటున్నారు. వాళ్లు నా పీఆర్ టీమ్ కాదు.. డబ్బు ఇచ్చి మరీ పొగిడించుకునేంత బడ్జెట్ నా దగ్గర లేదు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జాన్వీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరవుతున్నాయి. ఇటీవల మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాలో నటించింది. అలాగే హిందీలో పలు చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.