Bigg Boss 10: ఈసారి ఆట మాములుగా ఉండదు.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఆ క్రేజీ హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందా.?

బిగ్ బాస్ సీజన్ 10 కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విజయవంతంగా9 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో సీజన్ 10తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. ఇటీవలే బిగ్ బాస్ 10 ప్రోమోను విడుదల చేశారు.

Bigg Boss 10: ఈసారి ఆట మాములుగా ఉండదు.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఆ క్రేజీ హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందా.?
Biggboss 10

Updated on: Jun 16, 2026 | 7:10 AM

బిగ్ బాస్ గేమ్ షో తిరిగి వచ్చేస్తుంది. ఇప్పటికే విజయవంతంగా 9 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 10లోకి అడుగుపెడుతుంది. అతిత్వరలో బిగ్ బాస్ సీజన్ 10మొదలుకానుంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10పై సర్వత్రా ఆసక్తినెలకొంది. ఇప్పటికే సీజన్ 10 కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. అలాగే గత సీజన్ మాదిరిగానే ఈ సీజన్ లోనూ సామాన్యులకు అవకాశం ఇస్తూ అగ్నిపరీక్షను కూడా నిర్వహించనున్నారు. ఈ సారి బిగ్ బాస్ 10 సీజన్‌ గత సిజన్‌కంటే భిన్నంగా ఉండనుంది. గత కొన్ని రోజుల నుంచి బీబీ సీజన్ 10కి సంబంధించిన సన్నాహాలను స్టార్ మా నిర్వాహకులు మొదలు పెట్టి రసవత్తరంగా కొనసాగిస్తున్నారు. సీజన్ 10కు కూడా అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 1కి జూనియర్ ఎన్టీఆర్, సీజన్ 2కి నాని హోస్ట్‌గా వ్యవహరించారు. సీజన్ 3 నుంచి సీజన్ 9 వరకు హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జున.. ఈ సీజన్‌కు కూడా ఆయనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సీజన్స్ కు భిన్నంగా ఈ సీజన్ 10 ఉండేలా ప్లాన్ చేశారు మేకర్స్. దీంతో బీబీ సీజన్ 10పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటోంది. కాగా బిగ్ బాస్ సీజన్ 10లో పాల్గొనేది వీరే అంటూ కొంతమంది సెలబ్రెటీల పేర్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వారిలో ఓ హీరోయిన్ పేరు కూడా తెగ వినిపిస్తుంది.

ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ఆమె ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు. అంతే కాదు సహాయక పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ నటిస్తున్నారు ఆమె. ఆ హీరోయిన్ మరెవరో కాదు కస్తూరి. అప్పటిలో నటిగా ఓ వెలుగు వెలిగిన కస్తూరి. ప్రస్తుతం సీరియల్స్ లో రాణిస్తున్నారు. సినిమాలు, సీరియల్స్ తోపాటు పలు వివాదాల్లోనూ ఆమె పేరు వినిపించింది. కాగా కస్తూరి బిగ్ బాస్ సీజన్ 10లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని టాక్ గట్టిగా వినిపిస్తుంది. కాగా కస్తూరి ఇప్పటికే తమిళ్ బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. ఇక ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టడం దాదాపు ఖాయం అంటున్నారు. ఆమె హౌస్ లోకి వస్తే ఆట మరో లెవల్ లో ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి నిజంగా కస్తూరి బిగ్ బాస్ 10లోకి వస్తారేమో చూడాలి.

నటి కస్తూరి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us