Jamuna: ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో జమునకు విభేదాలెందుకొచ్చాయి? మళ్లీ ఎలా కలిసిపోయారు?

|

Jan 27, 2023 | 1:27 PM

అప్పట్లో స్టార్‌ హీరోయిన్‌గా చెలామణి అయిన జమునపై ఒకానొక సందర్భంలో మూడేళ్ల పాటు బ్యాన్‌ విధించారు. అదికూడా ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌. దీనికి కారణమేంటంటే.. తెలుగింటి సత్యభామగా గుర్తింపు పొందిన జమునకు తల పొగరు అని ఇండస్ట్రీలో ప్రచారం ఉండేదట.

Jamuna: ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో జమునకు విభేదాలెందుకొచ్చాయి? మళ్లీ ఎలా కలిసిపోయారు?
Ntr, Anr, Jamuna
Follow us on

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. అలనాటి అందాల తార జమున తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని తన స్వగృహంలో శుక్రవారం ఉదయం ఆమె కున్నుమూశారు. దీంతో సినిమా ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు జమున మృతికి నివాళులు అర్పిస్తున్నారు. కాగా తెలుగు, తమిళ్‌, హిందీలో కలిపి సుమారు 180కి పైగా చిత్రాల్లో నటించారు జమున. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కాంతారావు, జగ్గయ్య, హరినాథ్‌ తదితర దిగ్గజ నటుల సరసన నటించి ప్రేక్షకుల అభిమానం పొందారామె. కాగా అప్పట్లో స్టార్‌ హీరోయిన్‌గా చెలామణి అయిన జమునపై ఒకానొక సందర్భంలో మూడేళ్ల పాటు బ్యాన్‌ విధించారు. అదికూడా ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌. దీనికి కారణమేంటంటే.. తెలుగింటి సత్యభామగా గుర్తింపు పొందిన జమునకు తల పొగరు అని ఇండస్ట్రీలో ప్రచారం ఉండేదట. అంతేకాదు షూటింగ్‌లకు లేట్‌గా వస్తారని, పెద్దలకు ఏ మాత్రం గౌరవమిచ్చేవారు కాదని ఆమెపై వదంతులు వ్యాప్తి చెందాయి. ఈ క్రమంలోనే ఓ విషయంలో తలెత్తిన ఓ వివాదం కారణంగా.. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు తమ చిత్రాల్లో జమున నటించదని పత్రికాముఖంగా ప్రకటించారు.

తెలుగు ఇండస్ట్రీలో టాప్‌ ప్లేస్‌లో ఉన్న హీరోలు ఇలా ప్రకటించేసరికి జమున సినిమా కెరీర్‌ క్లోజ్‌ అయిపోతుందని చాలామంది భావించారు. అయితే ఆత్మాభిమానం మెండుగా ఉన్న జమున విషయంలో అలాంటి దేమీ జరగలేదు. ‘మీరు కాకపోతే ఏంటి?’ అంటూ కాంతారావు, జగ్గయ్య, హరినాథ్‌ తదితర హీరోల సినిమాల్లో నటించి సూపర్‌ హిట్లు అందుకున్నారు. బ్యాన్‌ చేసిన సమయంలోనూ జమున చేతిలో 5-6 సినమాలకు పైగానే ఉన్నాయంటే ఆమెకున్న క్రేజ్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే గుండమ్మ సినిమాతో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌తో తనకున్న విబేధాలు సమసిపోయాయని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారామె. ‘ఏ రంగంలో అయినా సరే.. ఓ స్త్రీ ఆత్మాభిమానంతో ఉంటే.. ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొవాల్సి వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో  నా గురించి రకరకాల విషయాలు ప్రచారంలోకి వచ్చాయి.  ఈ వివాదం పెద్దదిగా మారడంతో  మేం ముగ్గురం ఒకరినొకరం బ్యాన్‌ చేసుకున్నాం. మూడేళ్ల పాటు.. మా మధ్య ఈ వివాదం కొనసాగింది. అయితే గుండమ్మ సినిమాతో ఈ వివాదాలు సమసిపోయాయి’ అని ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు జమున.

మరిన్ని సినిమా వార్తల కోసంక్లిక్ చేయండి..