Tollywood: నాన్న పక్కన అమాయకంగా ఉన్న ఈ చిన్నది.. ఇప్పుడు స్టార్ హీరోయిన్

|

Aug 05, 2024 | 7:06 PM

నాన్న పక్కన అమాయకంగా ఉన్నది ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్. 100 కోట్ల క్లబ్‌లో ఎంట్రీ ఇచ్చింది. తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. మరోవైపు స్టడీస్‌ కూడా కొనసాగిస్తోంది..

Tollywood: నాన్న పక్కన అమాయకంగా ఉన్న ఈ చిన్నది.. ఇప్పుడు స్టార్ హీరోయిన్
Heroine Childhood Photo
Follow us on

హీరోయిన్‌గా రాణించాలంటే.. గ్లామర్ ఒలకపోయాలి.. ముట్టుకుంటే కందిపోయేలా ఉండాలి.. ఓ రేంజ్‌లో డ్యాన్స్ వేయాలి.. అని చెబుతుంటారు. కానీ కొంతమంది.. తమకున్న లిమిటెడ్ క్వాలిటీస్‌తో ఓ రేంజ్‌కు దూసుకుపోతారు. ఈ ఫోటోలోని పాప కూడా ఇప్పుడు అలానే హీరోయిన్‌గా రాణిస్తోంది. తొలుత సహాయ నటి పాత్రల్లో మెరిసి.. ఇప్పుడు హీరోయిన్‌గా మారి బ్లాక్ బాస్టర్ కొట్టింది. ఇంతకీ తనెవరో మీరు గుర్తుపట్టారా..?… తను ‘ప్రేమలు’ సినిమాలో హీరోయిన్ మమిత బైజు. చాలామంది గెస్ చేసే ఉంటారు. చిన్నప్పుడు చూడండి ఎంత క్యూట్‌గా ఉందో.. ఇప్పుడు కూడా అదే క్యూట్‌నెస్ కుర్రాళ్ల హృదయాలను దోచుకుంటోంది.

కేరళలోని కిడంగూర్ అనే మారుమూల ప్రాంతంలో.. పుట్టి పెరిగిన మమిత.. ప్రస్తుతం సైకాలజీలో డిగ్రీ చేస్తోంది. ఓవైపు మరోవైపు యాక్టింగ్ కూడా కంటిన్యూ చేస్తోంది. 2017లో ‘సర్వోపరి పాలక్కరన్’ అనే మలయాళ సినిమాతో నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. అనంతరం పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. కానీ ‘కోకో’ అనే స్పోర్ట్స్ డ్రామాతో ఈమెకు మస్త్ క్రేజ్ వచ్చింది.  ‘ప్రణయ విలాసం’, ‘సూపర్ శరణ్య’ సినిమాలతో కథానాయికగా మంచి పేరు తెచ్చుకుంది. ‘ప్రేమలు’తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. ఈ మూవీ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం.

మమిత బైజు పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఆమె తండ్రి.. వైద్యుడు కాగా.. తల్లి గృహిణి. మమితకు ఓ తమ్ముడు కూడా ఉన్నాడు.  ప్రస్తుతం ఈమె వయసు 22 ఏళ్లే. ఇండస్ట్రీలో చాలాకాలం పాటు తన మార్క్ చూసే అవకాశం ఉంది. ఇక రెబల్ అనే మూవీతో ఈ ఏడాది తమిళ్‌లోకి కూడా అడుగుపెట్టింది ఈ బ్యూటీ. ఇక తన తదుపరి ప్రాజెక్ట్స్‌పై స్పష్టత రావాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.