చిట్టి పాప డ్యాన్స్ కు మెస్మ‌రైజ్ అయిన‌ హృతిక్​…

|

Jun 13, 2020 | 4:20 PM

డ్యాన్స్ ను, హృతిక్‌ రోషన్ ను..వేరుచేసి చూడ‌లేం. త‌న అమేజింగ్ డ్యాన్స్ స్కిల్ తో ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు హృతిక్‌. బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్.. త‌న‌కు డ్యాన్స్ విష‌యంలో త‌న‌కు హృతిక్ ఆద‌ర్శం అని ప‌లు వేదిక‌ల్లో తెలిపాడు. అలాంటి హృతిక్‌ను ఓ చిట్టి పాప మెస్మ‌రైజ్ చేసింది. స్టెప్పులతో అద‌ర‌గొట్టి.. ఆశ్య‌ర్య‌ప‌రిచింది.

చిట్టి పాప డ్యాన్స్ కు మెస్మ‌రైజ్ అయిన‌ హృతిక్​...
Follow us on

డ్యాన్స్ ను, హృతిక్‌ రోషన్ ను..వేరుచేసి చూడ‌లేం. త‌న అమేజింగ్ డ్యాన్స్ స్కిల్ తో ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు హృతిక్‌. బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్..  డ్యాన్స్ విష‌యంలో త‌న‌కు హృతిక్ ఆద‌ర్శం అని ప‌లు వేదిక‌ల్లో తెలిపాడు. అలాంటి హృతిక్‌ను ఓ చిట్టి పాప మెస్మ‌రైజ్ చేసింది. స్టెప్పులతో అద‌ర‌గొట్టి.. ఆశ్య‌ర్య‌ప‌రిచింది. గీత్‌ అనే బాలిక హృతిక్‌ నటించిన ‘వార్’ మూవీలోని ‘జై జై శివ్‌ శంకర్’‌..సాంగ్ కు డ్యాన్స్‌ చేసింది. దీన్ని కొంద‌రు ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేయగా..అది చూసిన హృతిక్‌ స్పందించారు. పాప డ్యాన్స్‌ వీడియోను రీట్వీట్‌ చేస్తూ.. ‘వాట్‌ ఎ స్టార్‌.. లవ్‌యు’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గీత్‌ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

చిన్నారి ఫుల్ కాన్ఫిడెన్స్ తో అవలీలగా డ్యాన్స్‌‌ చేసిన తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. హృతిక్ రోష‌న్ ‘వార్‌’తో గతేడాది మంచి హిట్ త‌న ఖాతాలో వేసుకున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.475 కోట్లు కొల్ల‌గొట్టింది. దీని తర్వాత ఆయన ‘క్రిష్‌’ ఫ్రాంచైజీ కోసం వ‌ర్క్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.