నాని సినిమాకు బ్రేక్.. మేకర్స్‏కు షాకిచ్చిన హీరోయిన్.. ‘అంటే సుందరానికీ’ ప్యాకప్ చెప్పిన టీం..

|

Apr 27, 2021 | 4:37 PM

Ante Sunaraniki Movie Update: ఫస్ట్ ఎక్స్ పీరియన్స్ ఎప్పుడూ బెస్ట్ అంటూనే మూవీ యూనిట్ కు షాక్ ఇచ్చింది హీరోయిన్ నజ్రియా నజీమ్.

నాని సినిమాకు బ్రేక్.. మేకర్స్‏కు షాకిచ్చిన హీరోయిన్.. అంటే సుందరానికీ ప్యాకప్ చెప్పిన టీం..
శ్యామ్ సింగరాయ్ తో పాటు అంటే సుందరానికి అనే సినిమాలు లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం ఆ సినిమాలే కంప్లీట్ చేస్తున్నాడు. 
Follow us on

Ante Sunaraniki Movie Update: ఫస్ట్ ఎక్స్ పీరియన్స్ ఎప్పుడూ బెస్ట్ అంటూనే మూవీ యూనిట్ కు షాక్ ఇచ్చింది హీరోయిన్ నజ్రియా నజీమ్. హైదరాబాద్‏లో అడుగుపెట్టి ఐదు రోజులు కాకముందే.. షూటింగ్‏కు గ్యాప్ ఇచ్చింది. కరోనా సమయంలో కష్టమంటూ కామా పెట్టేసింది. దీంతో నానీ స్పీడ్‏కు నజ్రీయా బ్రేకులు వేసిందంటూ.. టాలీవుడ్ లో చర్చ సాగుతోంది. నజ్రియా దెబ్బతో ‘అంటే సుందరానికీ’ షూటింగ్ కూడా ఆపాల్సి వచ్చిందని సమాచారం. అసలు విషయానికి వస్తే.. నేచురల్ స్టార్ నానీ, మలయాళీ అందం నజ్రియా నజీమ్ జంటగా నటిస్తున్న చిత్రం.. ‘అంటే సుందరాని’కీ. ఈ మధ్యే తన భర్త ఫాజిల్ తో హైదరాబాద్ లో అడుగుపెట్టిన నజ్రియా.. తెలుగులో స్ట్రేయిట్ మూవీ చేస్తున్నానని.. ఫస్ట్ ఎక్స్ పీరియన్స్ ఎప్పుడూ బెస్ట్ అంటూ చెప్పుకొచ్చింది. షూట్ కూడా బాగా వచ్చిందంటూ కామెంట్ చేసింది.

అయితే హైదరాబాద్ లో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో.. నజ్రియా షూటింగ్ కు బ్రేక్ చెప్పేసిందట. ఇలాంటి పరిస్థితుల్లో హాజరుకాలేనని తేల్చిచెప్పారట. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్.. కొన్ని రోజుల పాటు షూట్ కు బ్రేక్ ఇచ్చారని టాక్. ఇటు నజ్రియా భర్త ఫాజిల్.. పుష్ప మూవీలో విలన్ గా చేస్తున్నారు. ఇలా భార్య భర్తలిద్దరూ ఒకేసారి తెలుగు చిత్రాల్లో నటిస్తుండటం.. ఆసక్తి రేపుతోంది. అంటే సుందరానికి ప్యాకప్ చెప్పేసాక.. ఈ మాలీవుడ్ కపుల్స్.. చెన్నైకి వెళ్లారని తెలుస్తోంది. దీంతో నాని సహా ‘అంటే సుందరానికీ’ టీమ్ ప్యాకప్ చెప్పేసి కొన్నిరోజుల పాటు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చేశారని సమాచారం. కాగా ఇందులో నటి నదియా కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని ఈ సినిమాతో పాటు శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.

Also Read: రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు.. జలుబు, ఫ్లూను తగ్గించే టీ.. సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోండిలా..

Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాక రెగ్యులర్ మందులు వాడొచ్చా. ? డాక్టర్ల సూచనలు ఎంటంటే..