స‌న్నీపై న‌వ‌దీప్ క‌విత‌..భ‌లే బిస్కెట్లు వేస్తున్నాడుగా..

|

Mar 31, 2020 | 8:40 AM

సన్నీ లియోన్..గురించి స్పెష‌ల్ ఇంట్ర‌క్ష‌న్ అవ‌స‌ర‌మా?. స్టార్ హీరోలకు కూడా లేని ఇమేజ్ ఆమెకు సొంతం. ఈ ముద్దుగుమ్మ‌ అటు వ‌రుస‌గా హిందీ సినిమాల్లో నటిస్తూనే…అప్పుడ‌ప్పుడు తెలుగులో కూడా కొన్ని మూవీస్ లో ఐటెమ్ సాంగ్స్ తో అదరగొడుతోంది. కాగా సన్నీ ప్ర‌స్తుతం తెలుగు న‌టుడు నవదీప్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. హిందీ నిర్మాణ సంస్థ ఆల్ట్ బాలాజీ “రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్” అనే వెబ్ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేస్తోంది. గ‌తంలో ఇదే సంస్థ‌ “రాగిని ఎంఎంఎస్” […]

స‌న్నీపై న‌వ‌దీప్ క‌విత‌..భ‌లే బిస్కెట్లు వేస్తున్నాడుగా..
Follow us on

సన్నీ లియోన్..గురించి స్పెష‌ల్ ఇంట్ర‌క్ష‌న్ అవ‌స‌ర‌మా?. స్టార్ హీరోలకు కూడా లేని ఇమేజ్ ఆమెకు సొంతం. ఈ ముద్దుగుమ్మ‌ అటు వ‌రుస‌గా హిందీ సినిమాల్లో నటిస్తూనే…అప్పుడ‌ప్పుడు తెలుగులో కూడా కొన్ని మూవీస్ లో ఐటెమ్ సాంగ్స్ తో అదరగొడుతోంది. కాగా సన్నీ ప్ర‌స్తుతం తెలుగు న‌టుడు నవదీప్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. హిందీ నిర్మాణ సంస్థ ఆల్ట్ బాలాజీ “రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్” అనే వెబ్ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేస్తోంది. గ‌తంలో ఇదే సంస్థ‌ “రాగిని ఎంఎంఎస్” అంటూ హారర్ మూవీస్ తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. తాజాగా వాటికి అప్డేటెడ్ వెర్ష‌న్ గా వెబ్ సిరీస్ రూపొందుతోంది. దీనిలో నవదీప్‌, సన్నీ లియోన్ కలిసి ఆడియెన్స్ ను భ‌య‌పెట్ట‌బోతున్నారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ జరుపుకుంటోంది.

కాగా నవదీప్ తాజాగా తన సోష‌ల్ మీడియా ఖాతాలో ఓ పిక్ పోస్ట్ చేశాడు. అందులో సన్నీ కోసం ఓ ప్రేమ క‌విత్వం రాసుకొచ్చాడు. “సన్నీ ఈజ్ ఫన్నీ… సన్నీ ఈజ్ స్మార్ట్… సన్నీ ఈజ్ హోమ్.. సన్నీ ఈజ్ సేఫ్.. బీ లైక్ సన్నీలియోన్.. ఐసోలేట్ యువర్సెల్ఫ్ అండ్ వాచ్.. రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్” అంటూ త‌న‌లోని క‌విని స‌న్నీ కోసం బ‌య‌ట‌కు తీశాడు న‌వ‌దీప్. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్ర‌స్తుతం సన్నీ.. ‘వీరమదేవి’, ‘రంగీలా’ అనే ద‌క్షిణాధి సినిమాల్లో నటిస్తోంది.