
1980-90వ దశకంలో సోషల్ మీడియా ఉండేది కాదు. ఎక్కువగా రేడియో, క్యాసెట్ ప్లేయర్లే ప్రధాన వినోద సాధనాలుగా ఉండేవి. అయితే అలాంటి సమయంలోనే ఒక పాట సంచలనం సృష్టిచింది. భాష అర్థం కాని వారు సైతం ఈ పాటకు లేచి నిలబడి డ్యాన్స్ చేసేలా ఉర్రూతలూగించింది. ఈ పాటకున్న ప్రజాదరణ ఎంత గొప్పదంటే, దశాబ్దాలు గడిచినా దాని క్రేజ్ ఇంకా కొనసాగుతోంది. ఇటీవల విడుదలైన ‘ధురందర్’ చిత్రంలో కూడా ఈ పాటను ఉపయోగించారు. అంతకు ముందు బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి లోనూ ఓ ఫైట సీన్ లోనూ ఈ ఎవర్ గ్రీన్ సాంగ్ ను వాడేశారు. ఇంతకీ ఆ పాట ఏదనుకుంటున్నారా? ‘హవా హవా’.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఈ పాట పాకిస్తాన్ లో పుట్టింది. పాకిస్తానీ పాప్ గాయకుడు హసన్ జహంగీర్ పాడిన ఈ పాట 1986లో రికార్డ్ చేయగా, 1987లో విడుదలైంది. ఈ పాటలోని ఆకట్టుకునే బీట్, బాణీల కారణంగా ఇది అతి తక్కువ సమయంలోనే భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో పెద్ద హిట్‌గా నిలిచింది. అప్పట్లో ఈ పాట రేడియోలో తరచుగా టెలికాస్ట్ చేసేవారు. అంతేకాదు ఈ సాంగ్ క్యాసెట్లు కూడా భారీ సంఖ్యలో అమ్ముడయ్యాయి.
హవా హవా పాటకున్న స్పెషాలిటీ ఏంటంటే..ఈ పాట బీట్ ఏ భాషకైనా సులభంగా ఇమిడిపోయే విధంగా ఉంటుంది. అందువల్ల హిందీలో ఉన్నప్పటికీ ఈ సాంగ్ ట్యూన్ అన్ని భాషల వారిని ఆకట్టుకుంటోంది. ‘హవా హవా ఐ హవా’ కేవలం ఒక ప్రజాదరణ పొందిన పాటగా మాత్రమే కాకుండా, ఆనాటి ఒక తరం మొత్తం జ్ఞాపకాలలో ఒక భాగంగా నిలిచింది. ఈ పాట కథ పాకిస్తాన్‌లో కాదు, ఇరాన్‌లో మొదలవుతుంది. 1970వ దశకంలో, ఇరాన్ సైకడెలిక్ రాక్ సంగీతానికి పితామహుడిగా పరిగణించబడే కౌరోష్ యగ్మాయ్, ‘హవా హవా’ అనే పర్షియన్ పాటను ప్రదర్శించారు. ప్రేమ, నిరీక్షణ భావాలను వ్యక్తపరిచే ఈ పాట బాణీ, ఆ తర్వాత సరిహద్దు దాటి ఇరాన్‌కు చేరింది.
దశాబ్దాలు గడుస్తున్నా, ‘హవా హవా ఐ హవా’ పాట ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదు. ‘ధురందర్’ చిత్రంలో సంజయ్ దత్ ఎంట్రీ కోసం ఈ పాటను ఉపయోగించడంతో, ఇది మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాటకు సంబంధించిన రీల్స్, డ్యాన్స్ వీడియోలే దర్శనమిస్తన్నాయి. ఈ పాట పాకిస్తాన్ నుండి పుట్టడం, దాని వెనుక ఉన్న ఇరానియన్ బాణీ, ఆ తర్వాత బాలీవుడ్‌లో దాని ప్రయాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ‘హవా హవా ఐ హవా’ కేవలం ఒక పాట మాత్రమే కాదు, సరిహద్దులను దాటి సంగీతం ఎంత ప్రజాదరణ పొందుతోందనడానికి ఇది ఒక అసాధారణ ఉదాహరణ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.