Happy Birthday Allu Aravind: ఈ పుట్టిన రోజు తన తండ్రిని మరింత యువకుడిగా మార్చాలని కోరుకుంటున్న అల్లు వారబ్బాయి

|

Jan 10, 2021 | 7:08 PM

చిత్ర పరిశ్రమలో బడా నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ పుట్టిన రోజు నేడు. తన బ్యానర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించాడు.అల్లు అరవింద్ ఓ సినిమాను నిర్మిస్తున్నారు. అంటే అది ఖచ్చితంగా హిట్ అనేటంత పేరు తెచ్చుకున్నారు..

Happy Birthday Allu Aravind: ఈ పుట్టిన రోజు తన తండ్రిని మరింత యువకుడిగా మార్చాలని కోరుకుంటున్న అల్లు వారబ్బాయి
Follow us on

Happy Birthday Allu Aravind: చిత్ర పరిశ్రమలో బడా నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ పుట్టిన రోజు నేడు. తన బ్యానర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ఆయన నిర్మించారు. అరవింద్ ఓ సినిమాను నిర్మిస్తున్నారు అంటే అది ఖచ్చితంగా హిట్ అనేటంత పేరు తెచ్చుకున్నారు.. కథల మీద ఆయనకు ఉన్న జడ్జ్‌మెంట్ అనే టాక్ ఫిల్మ్ నగర్ లో ఉంది.

ఈ రోజు 72వ పుట్టిన రోజును జరుపుకుంటున్న అరవింద్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అల్లు వారబ్బాయి స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. “నాన్నా ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలి. అన్ని సమయాల్లో నాకు అండగా, తోడుగా ఉన్నందుకు థాంక్యూ. మా జీవితాల్లో నీలాంటి వ్యక్తి ఉండడం ఎంతో అదృష్టం. ఈ పుట్టిన రోజు నిన్ను మరింత యువకుడిగా మార్చాలని కోరుకుంటున్నా… ” అని బన్నీ తండ్రికి విషెష్ చెప్పాడు.  “జనాల ముందు మీ గురించి ఎక్కువగా మాట్లాడే రోజు ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నా నాన్న అంటూ అల్లు శిరీష్ తండ్రికి బర్త్ డే విషెష్ చెప్పాడు.

ఇక మెగా బ్రదర్ నాగబాబు కూడా తనదైన శైలిలో అరవింద్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.  మీగురించి అందరికీ తెలిసిందే .. అయితే ఎవరికీ తెలియని, ఆఫ్ స్క్రీన్ హీరో.. ప్రతీ సినిమాను మాస్టర్ పీస్‌లా చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.. మీ నిర్ణయాన్నికి, విశ్లేషణకు ఎంత చెప్పినా తక్కువే అంటూ అల్లు అరవింద్‌ పై ప్రశంసల వర్షం కురిపించారు నాగబాబు. అల్లు రామలింగయ్య తనయుడిగా తన కెరీర్ లో చంటబ్బాయి వంటి సినిమాలో ఓ కామియో పాత్ర చేశాడు. తన నటనతో ప్రేక్షకులను నవ్వించారు అల్లు అరవింద్

Also Read:
వారితో పాటు తొలి ప్రాధాన్యతలో ప్రజాప్రతినిధులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలి.. ప్రధానికి ఎంపీ లేఖ