Rajinikanth: నేను, రజినీకాంత్ షూటింగ్‌లో ఒకటే సిగరెట్ కాల్చేవాళ్లం.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ నటుడు

టాలీవుడ్ నిర్మాత, నటుడు జీవీ నారాయణ రావు రజనీకాంత్‌తో తనకున్న స్నేహాన్ని, షూటింగ్‌లో ఒకే సిగరెట్ పంచుకున్న రోజులను గుర్తుచేసుకున్నారు. రజనీకాంత్ తన ఇంటికి వచ్చి.. తమ ఇంటి మనిషిలా మెలిగేవారని తెలిపారు. చిలకమ్మ చెప్పింది చిత్రంలో కలిసి నటించిన అనుభవాలను పంచుకున్నారు.

Rajinikanth: నేను, రజినీకాంత్ షూటింగ్‌లో ఒకటే సిగరెట్ కాల్చేవాళ్లం.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ నటుడు
Rajinikanth

Updated on: Mar 04, 2026 | 11:54 AM

టాలీవుడ్ నిర్మాత, నటుడు జీవీ నారాయణ రావు రజనీకాంత్‌తో తనకున్న స్నేహాన్ని, షూటింగ్‌లో ఒకే సిగరెట్ పంచుకున్న రోజులను గుర్తుచేసుకున్నారు. రజనీకాంత్ తన ఇంటికి వచ్చి.. తమ ఇంటి మనిషిలా మెలిగేవారని తెలిపారు. చిలకమ్మ చెప్పింది చిత్రంలో కలిసి నటించిన అనుభవాలను పంచుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..

టాలీవుడ్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో తనకున్న స్నేహాన్ని, తొలినాళ్ల ఇద్దరు కలిసి నటించిన అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించారు. షూటింగ్‌ల సమయంలో తామిద్దరం ఒకే సిగరెట్ పంచుకునేవారమని, అంతటి సన్నిహితంగా ఉండేవారమని ఆయన తెలిపారు. రజనీకాంత్ తమ ఇంటికి వచ్చి, ఇంటి సభ్యులతో ఓ ఇంటి మనిషిలా మెలిగేవారని.. తన అక్కను.. అక్కా.. అక్కా అంటూ ఆప్యాయంగా పిలిచేవారని జీవీ నారాయణరావు తెలిపారు. తరచూ లంచ్‌కు ఇంటికి వచ్చేవారని వివరించారు.

రజనీకాంత్‌తో కలిసి రెండు చిత్రాలు చేశానని.. చిలకమ్మ చెప్పింది సినిమాలో తమ మధ్య బాండింగ్ రెట్టింపు అయిందన్నారు. శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజనీకాంత్, సంగీత, శ్రీప్రియలతో పాటు తాను నటించినట్లు తెలిపారు. శర్మకు దర్శకుడిగా ఇది తొలి చిత్రం కాగా, ఆయన బాలచందర్ కో-డైరెక్టర్ అని పేర్కొన్నారు. పాలకొల్లులో మూడు నెలలకు పైగా జరిగిన ఈ సినిమా షూటింగ్ అనుభవాలను, యూనిట్ సభ్యులంతా కలిసికట్టుగా కెమెరాలు మోయడం, స్క్రిప్ట్‌లు చదవడం లాంటి పద్ధతులు ఆ రోజుల్లో ఉండేవని ఆయన వెల్లడించారు.

ఇది చదవండి: టీమిండియాలో వాడే యమ డేంజర్.. ఆ ఒక్కడి కోసం బ్రహ్మాస్త్రం సిద్దం చేశాం

Loading...
Unable to load recommendations.
Follow Us