Gaddar Film Awards 2026: గద్దర్ ఫిలిం అవార్డ్స్ – 2025.. చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్..

ప్రముఖ గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరిట తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా 2025వ సంవత్సరానికి గానూ తుది జాబితాను జ్యూరీ సభ్యులు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందజేశారు. ఈ సమావేశంలో నిర్మాత దిల్ రాజు, నటుడు తనికెళ్ల భరణి, రోజా రమణి , మణిశర్మ, ప్రగతి తదితరులు పాల్గొన్నారు.

Gaddar Film Awards 2026: గద్దర్ ఫిలిం అవార్డ్స్ – 2025.. చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్..
Gaddar Film Awards 2026

Updated on: Mar 07, 2026 | 11:40 AM

ప్రముఖ గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరిట తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా 2025వ సంవత్సరానికి గానూ తుది జాబితాను జ్యూరీ సభ్యులు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందజేశారు. ఈ సమావేశంలో నిర్మాత దిల్ రాజు, నటుడు తనికెళ్ల భరణి, రోజా రమణి , మణిశర్మ, ప్రగతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తాజాగా జ్యూరీ చైర్మన్ మణిశర్మ ఆధ్వర్యంలో విజేతల జాబితాను అధికారికంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ ప్రకటించారు. అలాగే విలక్షణ నటి జయసుధకు అక్కినేని నాగేశ్వర రావు అవార్డ్ ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా రాజ్ వెడ్స్ రాంబాయి, ఉత్తమ నటుడిగా తండేల్ చిత్రానికి గానూ నాగచైతన్య ఎంపికయ్యారు.

ఈ ఏడాది మొత్తం 17 విభాగాలలో ఈ అవార్డులను అందజేస్తున్నారు. కొత్తగా సామాజిక, సందేశాత్మక చిత్రాలకు సైతం ప్రత్యేక అవార్డులతోపాటు డాక్టర్ సినారే, ఏఎన్ఆర్ పేర్లతో పురస్కారాలను ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. దాదాపు 14 సంవత్సరాల సుధీర్ఘ విరామం తర్వాత నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో అవార్డులను ఇస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గతేడాది 2024-25 సంవత్సరానికి గానూ ప్రధాన విజేతల జాబితాను విడుదల చేశారు.

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ తుది జాబితా:

ఉత్తమ నటుడు – నాగ చైతన్య (తండేల్‌)

ఉత్తమ నటి – రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్‌)

ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి

ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా

ఉత్తమ తృతీయ చిత్రం – ది ప్రీ వెడ్డింగ్‌ షో

నేషనల్‌ ఇంటిగ్రిటీ సినిమా – తండేల్‌

ఉత్తమ పర్యావరణ చిత్రం – ఇగ్వా

ఉత్తమ డెబ్యూ ఫీచర్‌ ఫిల్మ్ – లిటిల్‌ హార్డ్స్

ఉత్తమ వినోదాత్మక చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం

ఉత్తమ సోషల్‌ మెసేజ్‌ చిత్రం – కోర్టు

ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్ మూవీ – మిరాయ్‌

ఉత్తమ బాలల చిత్రం – అనగనగనా

ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)

ఉత్తమ సపోర్టింగ్‌ నటుడు – శివాజీ

ఉత్తమ సపోర్టింగ్‌ నటి- భూమిక

ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్ కె రాబిన్‌ (దండోరా)

ఉత్తమ నేపథ్య గాయకుడు – అనురాగ్‌ (రాజు వెడ్స్ రాంబాయి)

ఉత్తమ నేపథ్య గాయని – సాహితి చాగంటి (కన్నప్ప)

ఉత్తమ హాస్యనటుడు – కృష్ణ తేజ (జిగ్రీస్‌)

ఉత్తమ బాలనటుడు – రోహన్ ‌ రాయ్‌ (ప్రీ వెడ్డింగ్‌ షో)

ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్‌ (యుఫోరియా)

ఉత్తమ స్క్రీన్‌ ప్లే రైటర్‌ – అనిల్‌ రావిపూడి

ఉత్తమ గేయ రచయిత – నందకిశోర్‌ (కుబేర)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ – కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌)

ఉత్తమ ఎడిటర్‌- శ్రీకర్‌ ప్రసాద్‌ (మిరాయ్‌)

ఉత్తమ ఆడియోగ్రాఫర్‌ – ఎం.ఆర్‌ రాధాకృష్ణన్‌ కిష్కిందపురి

ఉత్తమ కొరియోగ్రాఫర్‌ – గిర గిర గిర

ఉత్తమ ఆర్ట్ డైరక్టర్‌ – తోట తరణి ఛాంపియన్‌

ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్ – గోవింద్‌ అఖండ

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ – చాంపియన్‌ – చంద్రకాంత్‌

ఉత్తమ స్పెషల్‌ జ్యూరీ ఫిల్మ్ – 23

ఉత్తమ మేల్‌ యాక్టర్‌ – చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)

ఉత్తమ నటి – అనంతిక (8 వసంతాలు)

స్పెషల్‌ జ్యూరీ హీరో – రోషన్‌ (చాంపియన్‌)

పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు – కమల్ హాసన్

బి.ఎన్.రెడ్డి ఫిల్మ్ అవార్డు – సింగీతం శ్రీనివాసరావు

గిరెడ్డి అండ్ చక్రపాణి అవార్డు – చలసాని అశ్వనీదత్

కాంతారావు అవార్డు – ఆర్‌ నారాయణమూర్తి

ఘుపతి వెంకయ్య అవార్డు – రమేష్ ప్రసాద్ (ప్రసాద్ ల్యాబ్స్)

సి. నారాయణ రెడ్డి ఫిల్మ్ అవార్డు – సుద్దాల అశోక్ తేజ

ఎక్కువమంది చదివినవి : Song Flashback: రాలిపోయే పువ్వా పాటకు నేషనల్ అవార్డ్.. కానీ వెనక్కు ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆశాపాశం సాంగ్ రాసింది నేనే.. కానీ అతడు సాంగ్ నా కెరీర్ మలుపు తిప్పింది.. లిరిసిస్ట్..

Follow Us