మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకులను అలరిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఆదివారం వరకు రూ.13 కోట్ల షేర్ సాధించింది. యూఎస్‌లోనూ వసూళ్లు పాజిటీవ్‌గానే ఉన్నాయి. నేటి నుంచి వచ్చే కలెక్షన్స్ బట్టి ఈ చిత్రం ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చెప్పొచ్చు. అయితే వచ్చే వారం పెద్ద సినిమాలు ఏవీ విడుదలకు లేకపోవడం గద్దలకొండ గణేష్’ కలిసొచ్చే అంశం. వచ్చే నెల 2న ‘సైరా’ రాబోతుంది. అప్పటివరకు మెగా హీరో జోరు కొనసాగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే నటించింది. మాస్ క్రియేటర్ హరీశ్ శంకర్ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఇతర ప్రధాన పాత్రల్లో అధర్వ మురళి, మృణాళిని రవి కనిపించారు. మిక్కీ జే మేయర్ సంగీతమందించాడు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించాడు. కాగా చిత్ర టీం నేడు సక్సెస్ వేడుకను నిర్వహించింది.
#GaddalakondaGanesh Success Meet #VarunTej #poojahegde@IAmVarunTej @hegdepooja@harish2you @14ReelsPlus @MickeyJMeyer #Valmiki pic.twitter.com/mCYKL5k4ex
— Venkatesh V (@venkatesh_et) September 23, 2019