Breaking : ప్రేమ‌లో రానా..ప్రియురాలు ఫోటో రివీల్…

| Edited By: Pardhasaradhi Peri

May 12, 2020 | 5:41 PM

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ లిస్ట్ లో ముందుంటాడు రానా ద‌గ్గుబాటి. ఇప్పుడు ఈ టాల్ హీరో కూడా రిలేష‌న్షిప్ లోకి అడుగుపెట్టాడు. త‌న ప్రియురాలు ఫోటోను ట్విట్ట‌‌ర్ లో ఫోస్ట్ చేసి..త‌ను ప్ర‌పోజ‌ల్ కి అంగీక‌రించిన‌ట్టు తెలిపాడు రానా. ఆమె పేరు మిహీకా బజాజ్. త‌ను డ్యూ డ్రాప్ డిజైన్ అనే డిజైన్ స్టూడియో‌ను ర‌న్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదొక ఈవెంట్ కంపెనీ. అయితే, ఈ ఎవ‌రికీ ప‌రిచ‌యంలేని అమ్మాయితో ఇప్పుడు అకస్మాత్తుగా రానా జీవిత […]

Breaking : ప్రేమ‌లో రానా..ప్రియురాలు ఫోటో రివీల్...
Follow us on

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ లిస్ట్ లో ముందుంటాడు రానా ద‌గ్గుబాటి. ఇప్పుడు ఈ టాల్ హీరో కూడా రిలేష‌న్షిప్ లోకి అడుగుపెట్టాడు. త‌న ప్రియురాలు ఫోటోను ట్విట్ట‌‌ర్ లో ఫోస్ట్ చేసి..త‌ను ప్ర‌పోజ‌ల్ కి అంగీక‌రించిన‌ట్టు తెలిపాడు రానా. ఆమె పేరు మిహీకా బజాజ్. త‌ను డ్యూ డ్రాప్ డిజైన్ అనే డిజైన్ స్టూడియో‌ను ర‌న్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదొక ఈవెంట్ కంపెనీ. అయితే, ఈ ఎవ‌రికీ ప‌రిచ‌యంలేని అమ్మాయితో ఇప్పుడు అకస్మాత్తుగా రానా జీవిత భాగ‌స్వామిగా చెప్ప‌డంతో అంద‌రూ ఆశ్చర్యానికి గురయ్యారు. ప‌లువురు సినీ సెల‌బ్రిటీస్ సైతం సర్‌ప్రైజ్ అయ్యి రానాకు విషెస్ తెలుపుతున్నారు. ఉపాసన కొణిదెల, హన్సిక, స్వప్నా దత్, సమంత, శృతిహాసన్, కియారా అద్వానీ, ఈషా రెబ్బా, తమన్నా తదితరులు రానాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అభినందనలు తెలిపారు.