Ram Charan: 15 ఏళ్లు కష్టపడ్డాను.. కానీ ఇప్పుడు క్లింకార కోసం ఆ పని చేస్తాను.. రామ్ చరణ్ కామెంట్స్..

క్లింకారాతో తన సంతోషం, తండ్రిగా ప్రమోషన్ పొందిన తర్వాత జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి.. ? అలాగే క్లింకార వచ్చిన తర్వాత ఇంట్లో ఎలాంటి మార్పులు అయ్యాయి అనే విషయాలను చెప్పుకొచ్చాడు. మొదటి ఆరు నెలలు కుటుంబంలోకి కొత్త సభ్యుడు వచ్చినట్లు తప్ప మరేమి అనిపించలేదని..

Ram Charan: 15 ఏళ్లు కష్టపడ్డాను.. కానీ ఇప్పుడు క్లింకార కోసం ఆ పని చేస్తాను.. రామ్ చరణ్ కామెంట్స్..
Ram Charan, Klin Kaara
Follow us

|

Updated on: Jun 16, 2024 | 3:28 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు తండ్రిగా ఎంతో సంతోషంలో ఉన్న సంగతి తెలిసిందే. తన గారాలపట్టి క్లింకార రాకతో తన జీవితం పూర్తిగా మారిపోయిందంటున్నాడు గ్లోబల్ స్టార్. ఈరోజు (జూన్ 16) ఫాదర్స్ డే సందర్భంగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. క్లింకారాతో తన సంతోషం, తండ్రిగా ప్రమోషన్ పొందిన తర్వాత జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి.. ? అలాగే క్లింకార వచ్చిన తర్వాత ఇంట్లో ఎలాంటి మార్పులు అయ్యాయి అనే విషయాలను చెప్పుకొచ్చాడు. మొదటి ఆరు నెలలు కుటుంబంలోకి కొత్త సభ్యుడు వచ్చినట్లు తప్ప మరేమి అనిపించలేదని.. అలాగే తల్లి, బిడ్డ మధ్య బంధాన్ని చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. ఇప్పుడు క్లింకార ఇంట్లో అందరినీ గుర్తుపడుతుందని..ముఖ్యంగా తనను చాలా మిస్ అవుతుందంటూ చెప్పుకొచ్చారు.

“క్లింకార ఇప్పుడిప్పుడే అందర్ని గుర్తుపడుతుంది. నేను ఇంట్లో లేకపోతే నన్ను మిస్ అవుతుంది. ఆమె నా దగ్గర లేకపోయినా నేను కూడా మిస్ అవుతున్నాను. అసలు తనను వదిలి వెళ్లాలని అనిపించట్లేదు. అందుకే కనీసం తనకు రెండేళ్లు వచ్చేవరకు ఎక్కువ సమయం తనతో గడపాలనుకుంటున్నాను. తను స్కూల్ కు వెళ్లెవరకూ నా టైమింగ్స్ మార్చుకుని నా కూతురితో ఎక్కువ సమయం గడిపేలా ప్లాన్ చేసుకుంటాను. ఇప్పటికే నేను 15 ఏళ్లు కష్టపడ్డాను. ఇప్పుడు మాత్రం డైలీ సాయంత్రం 6వరకు ఇంటికి వచ్చి నా కూతురితో గడుపుతున్నాను.

తనను వదిలి షూటింగ్స్ కు వెళ్లడం కష్టంగానే ఉంటుంది. తనను చూడాగానే నా ఫేస్ లో ఒక సంతోషం వస్తుంది. నేను ఇంటి దగ్గరే ఉంటే క్లింకారా కు నేనే తినిపిస్తాను. ఈ విషయంలో మాత్రం నాతో ఎవరు పోటీ పడలేరు. ఇంట్లో అందరూ తనకు తినిపించడానికి కష్టపడుతారు. కానీ నేను తినిపిస్తే మాత్రం మొత్తం తినేస్తుంది. క్లింకారకు రెండుసార్లు ఆహారం నేనే తినిపిస్తాను. తనకు తినిపించడం చాలా ఇష్టం. ” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా అడియన్స్ ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles