Tollywood: హీరోయిన్‏తో ముద్దు సన్నివేశాలు.. ప్రతిసారి భార్యకు ఆ గిఫ్ట్ ఇస్తోన్న స్టార్ హీరో..

|

Jul 26, 2024 | 1:18 PM

అయితే తన సినిమాల్లో హీరోయిన్లతో లిప్ లాక్ సీన్స్ వచ్చిన ప్రతిసారి తన భార్యకు ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ బాహుమతిగా ఇచ్చేవాడినని..అలాగే ఆమె కోపాన్ని తగ్గించడానికి కచ్చితంగా షాపింక్ కోసం తీసుకెళ్లేవాడినని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు తన భార్యకు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వడం లేదని చెప్పుకొచ్చాడు. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న ఇమ్రాన్ హష్మీ.. తన లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

Tollywood: హీరోయిన్‏తో ముద్దు సన్నివేశాలు.. ప్రతిసారి భార్యకు ఆ గిఫ్ట్ ఇస్తోన్న స్టార్ హీరో..
Emraan Hasmi
Follow us on

బాలీవుడ్ ఇండస్ట్రీలో రొమాన్స్ రారాజు ఇమ్రాన్ హష్మీ. తన ప్రతి సినిమాలో లిప్ లాక్ సీన్స్ ఉండడం వల్ల ఈ హీరోకు సీరియల్ కిస్సర్ అనే ట్యాగ్ ఇచ్చారు జనాలు. ఒకప్పుడు రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్స్ కారణంగానే ఇండస్ట్రీలో ఇమ్రాన్ హష్మీ చాలా ఫేమస్ అయ్యాడు. అయితే తన సినిమాల్లో హీరోయిన్లతో లిప్ లాక్ సీన్స్ వచ్చిన ప్రతిసారి తన భార్యకు ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ బాహుమతిగా ఇచ్చేవాడినని..అలాగే ఆమె కోపాన్ని తగ్గించడానికి కచ్చితంగా షాపింక్ కోసం తీసుకెళ్లేవాడినని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు తన భార్యకు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వడం లేదని చెప్పుకొచ్చాడు. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న ఇమ్రాన్ హష్మీ.. తన లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

మల్లికా షెరావత్ తో కలిసి నటించిన మర్డర్ సినిమాను తన భార్యతో కలిసి చూశానని.. ఆ సమయంలో తెరపై రొమాంటిక్ సన్నివేశాలు, లిప్ లాక్ సీన్స్ చూసి తన భార్య తనపై కోప్పడిందని.. థియేటర్లో సినిమా చూస్తూనే ఆమె తన గోర్లతో రక్తం వచ్చేలా తనను గాయపరిచిందని తెలిపాడు. తనకు గాయమైందని.. నొప్పి కలుగుతుందని ప్రాదేయపడినా తన భార్య కోపం తగ్గలేదని.. దీంతో తనతో ఓ ఒప్పందం చేసుకున్నట్లు తెలిపాడు. తన సినిమాలు విడుదలైన వెంటనే తన భార్యను షాపింగ్ కు తీసుకెళ్తానని.. అక్కడ ఆమె ఎంతో ఖరీదైన హ్యాండ్ బ్యాగ్స్ కొనుగోలు చేసిందని చెప్పారు.

కానీ ఇప్పుడు ఆ ఒప్పందం లేదని.. ఎందుకంటే ఇప్పుడు తాను లిప్ లాక్ సీన్స్ చేయడం లేదని అన్నారు. అప్పట్లో తన భార్య కోపం కారణంగా బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయేదని సరదాగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను తెరపై లిప్ లాక్, రొమాంటిక్ సీన్స్ చేయడం అసహ్యించుకుంటున్నానని అన్నారు. ప్రస్తుతం ఇమ్రాన్ హష్మీ తెలుగులో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.