Tollywood: అమ్మాడి దొరికేసిందిరోయ్.! సుడిగాలి సుధీర్ ‘సర్కార్’ గేమ్ షోలో ఈ బ్యూటీ ఎవరో తెల్సా

సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న 'సర్కార్ సీజన్ 5' గేమ్ షో గురించి మీకు తెలిసిందే. ఆ గేమ్ షో.. 'లస్సీ' అని మధ్యలో ఓ బ్యూటీ వచ్చేది మీకు గుర్తుందా.? ఆమె ఎవరని అనుకుంటున్నారా.? హిస్టరీ తెలిస్తే షాక్ అవుతారు.

Tollywood: అమ్మాడి దొరికేసిందిరోయ్.! సుడిగాలి సుధీర్ ‘సర్కార్’ గేమ్ షోలో ఈ బ్యూటీ ఎవరో తెల్సా
Ishika Roy

Updated on: Jul 22, 2025 | 1:21 PM

సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ‘సర్కార్ సీజన్-5’ ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ గేమ్ షో సీజన్ 5 జూన్ 6 నుంచి మొదలై.. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. సుధీర్ హోస్టింగ్, సెలబ్రిటీల సందడితో.. ఇప్పటిదాకా సీజన్ 5లో ఏడు ఎపిసోడ్లు కాగా.. ఈసారి ఇందులో పాల్గొనేందుకు సాధారణ ప్రేక్షకులకు కూడా అవకాశం కల్పించింది సర్కార్ గేమ్ షో. ఇది ఇలా ఉంటే.. సుధీర్ హోస్టింగ్‌తో, గేమ్ మధ్యలో వచ్చే ‘లస్సీ’ పాప నెట్టింట తెగ వైరల్ అవుతోన్న విషయం విదితమే. అమ్మాడి అందాలకు కుర్రకారు తెగ ఫిదా అయిపోయారు. ఇంకేముంది ఈ బ్యూటీ ఇన్‌స్టా ఐడీ కోసం వెతుకులాట ప్రారంభించారు.

మరి ఆమె ఎవరంటే.? ‘లస్సీ’ అమ్మాడి పేరు ఇషికా రాయ్. హైదరాబాద్‌కు చెందిన ఈ బ్యూటీ.. ఫ్యాషన్ మోడల్‌గా మంచి పేరు తెచ్చుకుంది. పలు ప్రముఖ బ్రాండ్స్‌కి యాడ్స్ చేయడమే కాకుండా.. ఫ్యాషన్ మ్యాగజైన్లకు టాప్ మోడల్‌గా ఫోటోషూట్ చేసింది. ఇన్‌స్టాలో ఈ అమ్మాడికి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. సుమారు 72 వేల మంది ఈమెను ఫాలో అవుతుండగా.. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరి లేట్ ఎందుకు ఆమె లేటెస్ట్ ఫోటోలపై మీరూ ఓసారి లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి