ఈ ఫొటోలో ఉన్న క్రేజీ బ్యూటీని గుర్తుపట్టారా.? ప్రభాస్, నానిలాంటి హీరోలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది

సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ క్రేజీ హీరోయిన్.. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన పాపులర్ అయింది. వరుస హిట్స్ తో దూసుకుపోతుంది ఈ వయ్యారి భామ. ఒకే ఒక్క ఫ్లాప్ పడటంతో కాస్త స్పీడ్ తగ్గించింది. ఇంతకూ ఈ భామ ఎవరో తెలుసా.?

ఈ ఫొటోలో ఉన్న క్రేజీ బ్యూటీని గుర్తుపట్టారా.? ప్రభాస్, నానిలాంటి హీరోలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది
Actress

Updated on: Dec 07, 2025 | 9:46 AM

పై ఫోటోను చూశారా.? ఆ ఫొటోలో ఉన్న హీరోయిన్ను గుర్తుపట్టారా.? ఈ అమ్మడు ఇప్పుడు స్టార్ హీరోయిన్. ఒక్క సినిమాతో తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించింది. కెరీర్ తొలినాళ్లతో క్యారెక్టర్ ఆర్టిస్టు, ఆ తర్వాత బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుని.. ఇప్పుడు తెలుగుతో పాటు హిందీలోనూ స్టార్ స్టేటస్ సంపాదించింది. ఇంతకీ ఆ నటి ఎవరని అనుకుంటున్నారా.? మీలో క్లూ ఇస్తున్నా.. ఆమె తొలినాళ్లలో లిప్‌లాక్స్ వల్ల చాలా సినిమా ఆఫర్లు మిస్ చేసుకుందట. వరుస హిట్స్ తో దూసుకుపోతుంది ఈ అందాల భామ. ఇప్పటికైనా గుర్తొచ్చిందా.?

ఆమె మరెవరో కాదు క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. కెరీర్ తొలినాళ్లలో సీరియల్స్‌లో నటించిన ఈ వయ్యారి.. ‘ముజ్సే కుచ్ కెహ్తీ యే కమోషియా’ సీరియల్‌తో హిందీ బుల్లితెరకు పరిచయమైంది ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత ‘అర్జున్’, ‘కుమ్‌కుమ్ భాగ్య’ అనే సీరియళ్లతో పాపులారిటీ సంపాదించింది. సినీ ఇండస్ట్రీలోకి మృణాల్ ఠాకూర్ అడుగుపెట్టేనాటికి.. ఆమె వయస్సు 20 ఏళ్ళు. 2014లో వరుసగా మూడు మరాఠీ చిత్రాల్లో నటించింది మృణాల్. అయితే 2018లో విడుదలైన ‘లవ్ సోనియా’ చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఇది ఆమె మొదటి హిందీ సినిమా. ఇందులో డీ-గ్లామరస్ రోల్ చేసిన మృణాల్.. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

అనంతరం ‘సూపర్ ౩౦’, ‘బట్ల హౌస్’, ‘ఘోస్ట్ స్టోరీస్’, ‘జెర్సీ’ లాంటి సూపర్ హిట్స్ అందుకుంది. ఇక కెరీర్ మొదట్లో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడాన్ని మృణాల్ ఠాకూర్ తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారట. దాంతో పలు అవకాశాలను కోల్పోయిందట. ఆ తర్వాత తల్లిదండ్రులను ఒప్పించి ముద్దు సన్నివేశాల్లో నటించడట ఈ అందాల భామ. 2022లో విడుదలైన తెలుగు సినిమా ‘సీతారామం’తో మృణాల్ ఠాకూర్ క్రేజ్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయికి చేరింది. ఈ చిత్రంతో ఆమెకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు తలుపు తట్టాయి. మొన్నే ప్రభాస్ కల్కి సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. ప్రస్తుతం హిందీలో నటిస్తోంది మృణాల్ ఠాకూర్. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారును కునుకు వేయనికుండా చేస్తోంది. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.