ఈ వయ్యారి భామ ఎవరో గుర్తుపట్టారా.? ఒకేఒక్క సినిమాతో కుర్రాళ్ల మనసు దోచేసింది ఆమె

|

Aug 09, 2024 | 11:29 AM

తన అందంతో కుర్రాలందరిని కట్టిపడేసింది. తొలి సినిమాతోనే తన నటనతో పాటు గ్లామర్ తోనూ కట్టిపడేసింది. తొలి సినిమాతో సూపర్ హిట్ గా నిలిచినప్పటికీ ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.? తెలుగులో సినిమాలు చేసి సక్సెస్ కాలేకపోయిన ఈ చిన్నది బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.

ఈ వయ్యారి భామ ఎవరో గుర్తుపట్టారా.? ఒకేఒక్క సినిమాతో కుర్రాళ్ల మనసు దోచేసింది ఆమె
Actress
Follow us on

చాలా మంది హీరోయిన్స్ ఒక్క సినిమాతోనే ఓ ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది ఒక్క సినిమాతోనే కనపడకుండా మాయమవుతూ ఉంటారు. అలాంటివారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. తన అందంతో కుర్రాలందరిని కట్టిపడేసింది. తొలి సినిమాతోనే తన నటనతో పాటు గ్లామర్ తోనూ కట్టిపడేసింది. తొలి సినిమాతో సూపర్ హిట్ గా నిలిచినప్పటికీ ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.? తెలుగులో సినిమాలు చేసి సక్సెస్ కాలేకపోయిన ఈ చిన్నది బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. కానీ అక్కడ కూడా హిట్స్ అందుకోలేకపోయింది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టండి చూద్దాం.!

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు.. తన అందంతో కట్టిపడేసిన ముద్దుగుమ్మ స్నేహ ఉల్లాల్. స్నేహ ఉల్లాల్ ఒమన్ లోని మస్కట్ లో 1985 డిసెంబరు 8న జన్మించింది. 2005 లో హిందీ చిత్రం లక్కీ: నో టైమ్ ఫర్ లవ్ లో సల్మాన్ ఖాన్ సరసన నటించింది. ఈ అమ్మడు అచ్చం ఐశ్వర్య రాయ్ లా కనిపించడంతో వరుస అవకాశాలు అందుకుంది. తెలుగు సినిమాల్లో ఉల్లాసంగా ఉత్సహంగా చిత్రంతో అరంగేట్రం చేసింది.

ఉల్లాసంగా ఉత్సహంగా సినిమా తర్వాత కరెంట్, నేను మీకు తెలుసా ..?, సింహ సినిమాల్లో నటించింది. ఆతర్వాత కింగ్ లో నువ్వు రెడీ – నేను రెడీ పాటలో కనిపించింది. ఆమె 2010 లో విడుదలైన సింహా లో బాలకృష్ణ సరసన నటించింది. ఆతర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అలాగే రకరకాల వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను కవ్విస్తుంది. తాజాగా ఈ అమ్మడి హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్నేహ ఉల్లాల్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

స్నేహ ఉల్లాల్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..