అన్న ఇది నువ్వేనా..! ఈ హీరో గారిని గుర్తుపట్టారా.? ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాడు

సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ నిర్మలా కాన్వెంట్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. దీని తర్వాత పెళ్లి సందడి సినిమాతో హీరోగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఇటీవలే ఛాంపియన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు రోషన్ .

అన్న ఇది నువ్వేనా..! ఈ హీరో గారిని గుర్తుపట్టారా.? ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాడు
Movie News

Updated on: Feb 10, 2026 | 7:56 AM

శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇటీవలే ఛాంపియన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. హీరోగా రోషన్ కు ఇది మూడో సినిమా.. మొదటి సినిమా నిర్మలాకాన్వెంట్ అనే సినిమా చేశాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా సమయంలో రోషన్ చాలా చిన్నవాడు. నిజానికి 2015లో అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన రుద్రమ దేవి సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాడు రోషన్. ఆ మరుసటి ఏడాది అంటే 2016లో వచ్చిన నిర్మలా కాన్వెంట్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నాగ కోటేశ్వర రావు తెరకెక్కించిన ఈ టీనేజ్ లవ్ స్టోరీలో శ్రియా శర్మ హీరోయిన్ గా నటించింది. అక్కనేని నాగార్జున మరో కీలక పాత్ర పోషించాడు. కాగా ఇదే సినిమాలో రోషన్ స్నేహితులుగా ఇద్దరు స్టార్ కిడ్స్ కూడా నటించారు. వారిలో ఓ హీరో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాడు. పై ఫొటో ఉన్న ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా.?

పై ఫొటోలో రోషన్ పక్కనున్న ఆ హీరో ఎవరో గుర్తు పట్టారా? నిర్మలా కాన్వెంట్ సినిమాలో హీరోకు స్నేహితులుగా కనిపించిన ఆ స్టార్ కిడ్స్ ఇప్పుడు పెరిగి పెద్దవారయ్యారు. హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అందులో ఒకరు స్టార్ యాకంర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కాగా, మరొకరు బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్.

స్టార్ యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా నటించిన మోగ్లీ సినిమా ఇటీవలే విడుదలై నిరాశపరిచింది. ఇక బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ సినిమాల్లోకి రాకముందే క్రేజ్ సొంతం చేసుకున్నాడు. యాటిట్యూడ్ స్టార్ గా నెట్టింట మస్త్ పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఆమధ్య రామ్ నగర్ బన్నీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు చంద్రహాస్. ఇక రీసెంట్ గా బరాబర్ ప్రేమిస్తా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో మనోడు నోటికి పని చెప్పి ఓ పాట పాడాడు అందులో బూతులు వాడటంతో పెద్ద రచ్చ అయ్యింది. పోలీస్ కేసులు అంటూ హడావిడి అయ్యింది. ఇప్పుడిపుడే ఈ వివాదం సద్దుమణుగుతుంది. ఇక బరాబర్ ప్రేమిస్తా సినిమాలో తనదైన డ్యాన్స్, నటనతో ఆకట్టుకున్నాడు చంద్రహాస్. ప్రస్తుతం తన తర్వాతి సినిమా పనుల్లో బిజీగా ఉంటున్నాడీ యాటిట్యూడ్ స్టార్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.