ఈ రెండుజెళ్ళ అమాయకపు నవ్వుల చిన్నారి ఇప్పుడు.. ఇండస్ట్రీని ఊపేస్తున్న క్రేజీ బ్యూటీ

|

Sep 06, 2024 | 9:54 PM

ఒకప్పుడు పేపర్ కట్స్ ను రూమ్ లో లేదంటే బుక్స్ లో చాలా జాగ్రత్తగా దాచుకుంటుంటారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఫ్యాన్స్ పేజ్ లు క్రియేట్ చేసి.. తెగ షేర్ చేస్తున్నారు. హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గరనుంచి రీసెంట్‌గా ఆ హీరోయిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటో షూట్స్ వరకు  అన్నీంటిని చాలా భద్రంగా దాచుకుంటూ ఉంటారు అభిమానులు.

ఈ రెండుజెళ్ళ అమాయకపు నవ్వుల చిన్నారి ఇప్పుడు.. ఇండస్ట్రీని ఊపేస్తున్న క్రేజీ బ్యూటీ
Actress
Follow us on

స్టార్ హీరోయిన్స్ హీరోయిన్స్‌కు సంబందించిన ఫోటోలను అభిమానులు ఎంత పదిలంగా దాచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు పేపర్ కట్స్ ను రూమ్ లో లేదంటే బుక్స్ లో చాలా జాగ్రత్తగా దాచుకుంటుంటారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఫ్యాన్స్ పేజ్ లు క్రియేట్ చేసి.. తెగ షేర్ చేస్తున్నారు. హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గరనుంచి రీసెంట్‌గా ఆ హీరోయిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటో షూట్స్ వరకు  అన్నీంటిని చాలా భద్రంగా దాచుకుంటూ ఉంటారు అభిమానులు. తాజాగా ఓ క్రేజీ బ్యూటీ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నదాన్ని గుర్తుపట్టారా.? ఆమె ఎవరో గుర్తుపట్టడం పెద్ద కష్టమేమీ కాదు. అలా అని అంత ఈజీగా గుర్తుపట్టలేరు లెండి.. ఈ అమ్మడు. ఇప్పుడు తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

మన తెలుగమ్మాయే అయినప్పటికీ ముందుగా తమిళ్ సినిమాతో పరిచయం అయ్యింది. ఆతర్వాత తెలుగులో నటించి మంచి హిట్స్ అందుకుంది. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..? పై ఫొటోలో రెండు జడలు వేసుకొని పెద్ద కళ్ళజోడు పెట్టుకొని అమాయకంగా నవ్వుతు కనిపిస్తున్న ఈ చిన్నది ఎవరో కాదు..  అందాల భామ అంజలి.

తమిళ్ లో వచ్చిన షాపింగ్ మాల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది. షాపింగ్ మాల్ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ చిన్నది. ఆతర్వాత జర్నీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అంజలి. అలాగే హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది అంజలి. సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో అంజలి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత ఈ అమ్మడుకి చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. దాంతో కొన్ని సినిమాల్లో కీలక పాత్రలో నటించింది. అలాగే సూర్య సింగం2, అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెప్పించింది. అటు తమిళ్ సినిమాల్లోనూ.. ఇటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తుంది అంజలి. ప్రస్తుతం గేమ్ చెంజర్ సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో రామ్ చరణ్ భార్యగా నటిస్తోందని టాక్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.