రంగుల పండుగ హోలీని దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. కుటుంబాలతో ,స్నేహితులతో కలిసి హోలీని సెలబ్రేట్ చేసుకున్నారు. సెలబ్రెటీలు కూడా ఈ పండుగను ఎంతో సంబరంగా జరుపుకున్నారు హొలీ రంగుల్లో మునిగిన ఫోటోలను అందాల భామలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న నటిని గుర్తుపట్టారా.? ఆమె చాలా ఫేమస్. తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అలాగే తన మంచి మనసులో ప్రేక్షకులకు దగ్గరయింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? కనిపెట్టడం కష్టంగా ఉందా.? అయితే మీకోసం ఓ క్లూ.. ఆమె సినిమా హీరోయిన్ కాదు.. టీవీ యాక్టర్స్, యాంకర్. తన ముద్దు ముద్దు మాటలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న అమ్మడు ఆమె. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టరా.?
పై ఫొటోలో ఉన్న ముద్దు గుమ్మా ఎవరో కాదు.. తన ముద్దుముద్దు మాటలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న యాంకర్ రష్మీ గౌతమ్. జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఇప్పుడు ఎక్కువగా బుల్లితెరకే పరిమితమైందీ అందాల తార. కాగా టాలీవుడ్ బుల్లితెరకు సంబంధించి పెళ్లి కానీ ది మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్స్ లో స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ పేరు కూడా ఉంటుంది.
జబర్తస్త్ ఫేమ్, మరో స్టార్ యాంకర్ సుడిగాలి సుధీర్‌తో రష్మీ ప్రేమలో ఉందని.. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారని రూమర్లు వైరల్ అయ్యాయి. రేపో మాపో రష్మి, సుధీర్ పెళ్లి జరగనుందని ఎన్నోసార్లు ప్రచారం జరిగింది. కానీ టీవీ షోల్లో వీరి పెళ్లి జరిగింది కానీ నిజ జీవితంలో మాత్రం అది రూమర్ గానే మిగిలిపోయింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది టీవీ షోలతో బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలోనూ రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అంతే కాదు మూగజతువులంటే రష్మీకి ఎంతో ప్రేమ. మూగజీవుల గురించి, వాటి సంరక్షణ గురించి కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఉంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..