Vishwasam Movie: అజిత్ విశ్వాసం మూవీలో జగపతి బాబు కూతురు గుర్తుందా.. ? ఇప్పుడు ఏ రేంజ్‏లో మారిపోయిందంటే..

|

Jun 30, 2024 | 12:19 PM

అజిత్ సరసన నయనతార నటించగా.. వీరిద్దరి కూతురిగా అనిక సురేంద్రన్ నటించింది. ఈ మూవీతో అనికకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. అలాగే సౌత్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇందులో వివేక్, కోవై సరళ కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో విలక్షణ నటుడు జగపతి బాబు ప్రతినాయకుడిగా కనిపించాడు.

Vishwasam Movie: అజిత్ విశ్వాసం మూవీలో జగపతి బాబు కూతురు గుర్తుందా.. ? ఇప్పుడు ఏ రేంజ్‏లో మారిపోయిందంటే..
Saloni
Follow us on

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో విశ్వాసం ఒకటి. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ డబ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ శివ దర్శకత్వంలో వహించిన ఈ సినిమాకు అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అజిత్, శివ కాంబోలో వచ్చిన నాల్గవ సినిమా ఇది. ఇందులో అజిత్ సరసన నయనతార నటించగా.. వీరిద్దరి కూతురిగా అనిక సురేంద్రన్ నటించింది. ఈ మూవీతో అనికకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. అలాగే సౌత్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇందులో వివేక్, కోవై సరళ కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో విలక్షణ నటుడు జగపతి బాబు ప్రతినాయకుడిగా కనిపించాడు.

అలాగే జగపతి బాబు కూతురు నేహా పాత్రలో నటించింది చైల్డ్ ఆర్టిస్ట్ సలోని. ఈ సినిమాలో నేహా ముఖ్యమైన పాత్ర. ఎందుకంటే అజిత్ కూతురిని చంపేందుకు జగపతి బాబు ప్రయత్నించడానికి కారణం తన కూతురు నేహానే. ఈ సినిమాతో అనికతోపాటు సలోనికి మంచి గుర్తింపు వచ్చింది. విశ్వాసం కంటే ముందు రజినీకాంత్ నటించిన కాలా చిత్రంలో నటించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించిన సలోని చదువుల దృష్ట్యా సినిమాలకు దూరమైంది.

Saloni Look

చాలా కాలం తర్వాత సలోనికి సంబంధించిన కొన్ని ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. చీరకట్టులో ఎంతో అందంగా కనిపిస్తుంది సలోని. ప్రస్తుతం చీరలో సలోని ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. అలాగే మోడ్రన్ దుస్తుల్లోనూ కనిపించి మరింత షాకిచ్చింది సలోని. దీంతో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు కచ్చితంగా హీరోయిన్ కావడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.