ఇప్పుడు ఇండస్ట్రీనే ఏలేస్తుంది.. హీరోలకు ఏ మాత్రం తీసిపోని స్టార్ ఆమె.. ఎవరో గుర్తుపట్టారా.?

చాలా మంది హీరోయిన్స్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. కొంతమంది హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. వారిలో ఈ ఫొటోలో కనిపిస్తున్న వయ్యారి భామ ఒకరు. ఆమె ఓ స్టార్ హీరోయిన్.. రెమ్యునరేషన్ లోనూ ఆమె టాప్

ఇప్పుడు ఇండస్ట్రీనే ఏలేస్తుంది.. హీరోలకు ఏ మాత్రం తీసిపోని స్టార్ ఆమె.. ఎవరో గుర్తుపట్టారా.?
Actress

Updated on: Nov 24, 2025 | 10:19 AM

ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తుంది. రెగ్యులర్ గా ఆమె పేరు వార్తల్లో వినిపిస్తుంది. అనుకోకుండా వివాదం లో చిక్కుకుంది ఆ స్టార్ హీరోయిన్ ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? తండ్రి ఒడిలో ఉన్న ఈ బుజ్జాయి ఇప్పుడు క్రేజీ హీరోయిన్. సౌత్ అమ్మాయి అయినప్పటికీ నార్త్ ఇండస్ట్రీని ఏలేసింది. నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని గ్రాడ్యుయేషన్ తర్వాత ముంబైకి చేరి ఒంటరిగా సినీప్రయాణం స్టార్ట్ చేసింది. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుని ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిగా మారింది. ఆమె తండ్రి ఒకప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్. ఇన్నాళ్లు హిందీలో అగ్ర హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరోతో జతకట్టింది. తెలుగులోనూ సూపర్ హిట్ మూవీ చేసింది. ఈ హీరోయిన్ మరెవరో కాదు.. బీటౌన్ బ్యూటీ దీపికా పదుకొణె.

దీపికా తండ్రి బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకొణె. చిన్న వయసులోనే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆమె.. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాగానే ముంబై చేరి అక్కడ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తో తన ఫస్ట్ మూవీ చేసే ఛాన్స్ కొట్టేసింది. ఓం శాంతి ఓం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ తార.. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. అటు సినిమాలు.. ఇటు వాణిజ్య ప్రకటనలు చేసింది.

ఇటీవలే  ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి చిత్రంతో సౌత్ అడియన్స్ ముందుకు వచ్చింది. అంతకు ముందు జవాన్, పఠాన్ చిత్రాలతో మరిన్ని సక్సెస్ లు అందుకుంది. అలాగే ఈ అమ్మడు రీసెంట్ కాగా కొన్ని వివాదాల్లోనూ చిక్కుకుంది. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాకు ఆమె పెట్టిన కండీషన్స్ పెద్ద రచ్చ అయ్యాయి. ప్రస్తుతం దీపికా తన కూతురుతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఆమెకు ఇన్ స్టాలో 8 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.