ఐశ్వర్య రాయ్‌లాంటి విశ్వసుందరితో నటించాడు.. చివరకు బైక్ మెకానిక్ అయిన హీరో.. ఇప్పుడు ఇలా

సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు స్టార్స్ అవుతారో చెప్పడం చాలా కష్టం.. కొంతమంది ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సొంతం చేసుకున్నవారు ఉన్నారు. అలాగే కొన్ని సినిమాలతోనే కనిపించకుండా మాయం అయిన హీరోలు, హీరోయిన్స్ కూడా ఉన్నారు. వారిలో ఈ స్టార్ హీరో ఒకరు.

ఐశ్వర్య రాయ్‌లాంటి విశ్వసుందరితో నటించాడు.. చివరకు బైక్ మెకానిక్ అయిన హీరో.. ఇప్పుడు ఇలా
Aishwarya Rai

Updated on: May 26, 2026 | 9:21 AM

సినిమా ఇండస్ట్రీలో ప్రతిభతో పాటు అంతో ఇంతో అదృష్టం కూడా ఉండాలి.. అదే లేక పోతే నెట్టుకురావడం కష్టమే. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎంతో టాలెంట్ ఉండి కూడా కనిపించకుండా మాయం అయిన వారు చాలా మంది ఉన్నారు. స్టార్ హీరోలు, హీరోయిన్స్ అవుతారు అనుకున్నవారు ఊహించని విధంగా ఇండస్ట్రీ వదిలిపెట్టిపోయారు. మరికొంతమంది సహాయక పాత్రలతో సరిపెట్టుకుంటున్నారు. కొంతమంది ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యి తిరిగి వచ్చి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తూ విలన్స గా, సహాయ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. కాగా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న హీరో ఒకప్పుడు తోపు.. లవర్ బాయ్ ఇమేజ్ తో ఇండస్ట్రీని షేక్ చేసింది. అమ్మాయిల డ్రీమ్ బాయ్ ఆయన.. ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ తో కలిసి నటించాడు.. కానీ ఆతర్వాత బైక్ మెకానిక్ జీవితం గడిపాడు. ఆ హీరో ఎవరో తెలుసా.?

ఐశ్వర్య రాయ్‌లాంటి విశ్వసుందరితో నటించారు ఆ హీరో.. కానీ స్టార్ డమ్ సొంతం చేసుకోలేకపోయాడు ఆయన ఎవరో కాదు అబ్బాస్. అప్పట్లో అబ్బాస్ కు ఉన్న క్రేజే వేరు.. ముఖ్యంగా అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు అబ్బాస్. అబ్బాస్ నటించిన సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. వాటిలో 1996లో విడుదలైన ప్రేమ దేశం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా యువతకు ఈ సినిమా బాగా నచ్చేసింది. ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ లవ్ స్టోరీలో వినీత్, అబ్బాస్, టబు ప్రధాన పాత్రలు పోషించారు.

ఐశ్వర్య రాయ్ తో కలిసి ప్రియురాలు పిలిచింది సినిమాలో అబ్బాస్ నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఓవైపు రాజ హంస వంటి సినిమాల్లో సోలో హీరోగా నటిస్తూనే రాజా, కృష్ణ బాబు, ప్రియా ఓ ప్రియా వంటి సినిమాల్లో స్పెషల్ రోల్స్ పోషించాడు.ఇక నీ ప్రేమకై, నితిన్ మారో వంటి సినిమాల్లో విలన్ గానూ మెప్పించాడీ హ్యాండ్సమ్ యాక్టర్. తెలుగు, తమిళ్ భాషలలో మొత్తం 50కు పైగా చిత్రాల్లో నటించాడు అబ్బాస్. అయితే ఉన్నట్లుండి ఇండస్ట్రీ నుంచి మాయమైపోయాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.. ఇండస్ట్రీ నుంచి దూరమైన తర్వాత న్యూజిలాండ్‌కు వెళ్లిన అబ్బాస్, కుటుంబాన్ని పోషించడానికి మెకానిక్‌గా, ట్యాక్సీ డ్రైవర్‌గా కూడా పనిచేశాడట.. ఆతర్వాత సాఫ్ట్ వేర్ జాబ్ చేశారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ పంచుకున్నారు. ఇక ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి వచ్చారు అబ్బాస్. ఇటీవలే తమిళ్ లో జీవి ప్రకాష్ నటించిన హ్యాపీ రాజా సినిమాలో నటించారు అబ్బాస్.

అబ్బాస్ ఫేస్ బుక్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us