ఈ ఫొటోలో రజినీకాంత్ చేతిలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా..! ఆమె ఓ ఫెమస్ హీరోయిన్

|

Jun 18, 2024 | 5:12 PM

పై ఫొటోలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ హీరోయిన్. సూపర్ స్టార్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడమే కాదు.. ఆయన పక్కన హీరోయిన్ గా నటించింది ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అందం అభినయంతో మెప్పించిన ఆమె ఒకానొక సమయంలో కుర్రాళ్ల ఫెవరెట్ హీరోయిన్. ఈ చిన్నది ఇప్పటికీ తరగని అందంతో ఆకట్టుకుంటుంది.

ఈ ఫొటోలో రజినీకాంత్ చేతిలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా..! ఆమె ఓ ఫెమస్ హీరోయిన్
Actress
Follow us on

చాలా మంది హీరోయిన్స్ పలు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసి ఆతర్వాత హీరోయిన్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు . అలాగే కొంతమంది స్టార్ హీరోల సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. పై ఫొటోలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ హీరోయిన్. సూపర్ స్టార్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడమే కాదు.. ఆయన పక్కన హీరోయిన్ గా నటించింది ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అందం అభినయంతో మెప్పించిన ఆమె ఒకానొక సమయంలో కుర్రాళ్ల ఫెవరెట్ హీరోయిన్. ఈ చిన్నది ఇప్పటికీ తరగని అందంతో ఆకట్టుకుంటుంది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ?

సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. కెరీర్ బిగినింగ్ లో వరుసగా సినిమాల్లో నటించారు రజినీకాంత్. ఇప్పటికే 175 సినిమాల్లో నటించారు రజినీకాంత్. ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. ఇక పై ఫొటోలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి ఉన్న చిన్నారి ఎవరో కాదు అందాల భామ మీనా. తెలుగు, తమిళ, మలయాళం సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలనటిగా రజినీకాంత్, కమలహాసన్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది మీనా.

అలాగే మీనా హీరోయిన్ గా నటించిన తమిళ సినిమాల్లో ముత్తు, యజమాన్, వీరా, అవ్వై షణ్ముగి మంచి విజయాలు సాధించాయి. తెలుగులో వెంకటేష్, మీనా జంటగా సుందర కాండ, చంటి, సూర్య వంశం, అబ్బాయిగారు, దృశ్యం, దృశ్యం2 వంటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఇలా తెలుగు, తమిళ చిత్రరంగాలలో 1991 నుండి 2000 వరకూ, సుమారు ఒక దశాబ్దం పాటు అగ్రతారగా నిలచింది మీనా. తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణలతో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. మీనా కూతురు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసింది. 2009లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌తో మీనా వివాహం అయ్యింది. 2022లో అనారోగ్యంతో మరణించారు. ఇక సోషల్ మీడియాలో మీనా చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

మీనా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.