
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం హిట్స్ లేక సతమతం అవుతున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నా హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నాడు నితిన్. ఇక ఇప్పుడు నాని ప్రొడక్షన్ హౌస్ లో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ కుర్రహీరో వెండితెరకు పరిచయమైన సినిమా జయం. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన ఈసినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఒకప్పుడు యూత్‌కు తెగ నచ్చేసిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇండస్ట్రీని షేక్ చేసింది జయం సినిమా. ఇందులో నితిన్ సరసన సదా హీరోయిన్ గా నటించింది. తేజ తెరకెక్కించిన ఈ సినిమాతోనే నితిన్, సదా ఇద్దరూ తెలుగు తెరకు నటీనటులుగా పరిచయంకాగా.. అప్పట్లో జయం సినిమా సృష్టించిన సంచలనం గురించి చెప్పక్కర్లేదు.
అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ గురించి తెలిసిందే. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్. ఆర్పీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలెట్ అయ్యింది. అలాగే ఈ సినిమాలో హీరో గోపిచంద్ విలన్ పాత్రలో అదరగొట్టేశారు. తన నటనతో గోపీచంద్ ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో గోపిచంద్ గర్ల్ ఫ్రెండ్‌గా నటించిన బ్యూటీ గుర్తుందా..? ఈ మూవీలో ఆమె కనిపించింది కాసేపే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ బ్యూటీ రియల్ పేరు అనామిక ప్రవళిక. తెలుగుతోపాటు తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. కానీ తెలుగులో ఈ ముద్దుగుమ్మ పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది. సీరియల్ నటిగా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఇక సీరియల్స్ లో శిఖరం, సీతామహాలక్ష్మి వంటి సీరియల్స్ ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. అలాగే రాత్రి , రూ.999 మాత్రమే, సంభవామి యుగే యుగే, పిల్ల దొరికితే పెళ్లి ఇలా పలు చిత్రాల్లో నటించింది. కానీ జయం సినిమాతోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు ఎక్కువగా బోల్డ్ పాత్రలే వచ్చాయి. ఒకప్పుడు గ్లామరస్ పాత్రలతో ఇండస్ట్రీలో సెన్సేషన్ అయిన ఆమె.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవడానికి నెటిజన్స్ ట్రై చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.