Janhvi Kapoor: అతిలోక సుందరి కూతురు జాన్వీ డ్రస్ ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..

|

Jan 13, 2023 | 1:26 PM

ఇటీవల మనదగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేసుకున్న హుడ్డి, ప్రభాస్ షర్ట్.. తారక్ వాచ్, చరణ్ షూస్ ఇలా మన హీరోలకు సంబంధించిన ఎదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది.

Janhvi Kapoor: అతిలోక సుందరి కూతురు జాన్వీ డ్రస్ ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..
Janhvi Kapoor
Follow us on

సెలబ్రెటీల లైఫ్ చాలా కాస్ట్లీ గురూ.. ముఖ్యంగా సినిమా తారాలు లైఫ్ మరీనూ.. కాళ్లకు చెప్పుల నుంచి నెత్తిమీది క్యాప్ వరకు ఫుల్ కాస్ట్ ఉంటుంది. కార్లు, బంగ్లాల గురించి చెప్పాల్సిన అవరసం లేదు. ఇటీవలే సినిమా సెలబ్రెటీల లైఫ్ స్టైల్ గురించి నిత్యం చాల రకాల వార్తలు వస్తూ ఉంటాయి. ఇక వారి డ్రస్ మరీ కాస్ట్ ఉంటాయి. ఇటీవల మనదగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేసుకున్న హుడ్డి, ప్రభాస్ షర్ట్.. తారక్ వాచ్, చరణ్ షూస్ ఇలా మన హీరోలకు సంబంధించిన ఎదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఓ అమ్మాయి డ్రస్ ధర ఇప్పుడు నెటిజన్ల దిమ్మతిరిగేలా చేస్తోంది.

ఆ అమ్మడు ఎవరో కాదు బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్. ఈ వయ్యారి భామ నిత్యం రకరకాల డ్రస్ ల్లో దర్శనమిస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. రకరకాల ఫొటోలతో నిత్యం సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తూ ఉంటుంది ఈ చిన్నది.

తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ డ్రస్ లో మెరిసి అందరిని ఆకట్టుకుంది. అయితే ఈ డ్రస్ ధర ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అలెక్స్ పెర్రీ రెడ్ డిజైనర్ డ్రెస్ లో జాన్వీ తళుక్కుమంది. ఈ డ్రెస్ ఖరీదు రూ.72వేలు. జాన్వీ కొత్త లుక్ ని స్టైలిస్ట్ తాన్యా ఘావ్రీ సోషల్ మీడియాల్లో షేర్ చేసారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..