చూడటానికి ఇలా ఉన్నాడే కానీ.. ఈయన మామూలోడు కాదు..! బ్యాగ్రౌండ్ తెలిస్తే బుర్ర బ్లాక్ అవ్వుద్ది

|

Aug 08, 2024 | 9:24 AM

. హీరో సూర్య నటించిన సింగం సినిమాలో విలన్ పక్కన ఉండే సహాయం అనే పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆతర్వాత రాజారాణి సినిమాలో హీరో పని చేసే ఆఫీస్ లో బాస్ గా నటించాడు. వీటితో పాటు శివకార్తికేయన్ హీరోగా నటించిన రెమో సినిమాలో నటించాడు రాజేంద్రన్. కమెడియన్ గా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ నటుడి బ్యాగ్రౌండ్ గురించి చాలా మందికి తెలియకపోవొచ్చు.

చూడటానికి ఇలా ఉన్నాడే కానీ.. ఈయన మామూలోడు కాదు..! బ్యాగ్రౌండ్ తెలిస్తే బుర్ర బ్లాక్ అవ్వుద్ది
Actor Rajendran
Follow us on

పై ఫొటోలో ఉన్న నటుడిని గుర్తుపట్టారా..? ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా, విలన్ గా నటించి మెప్పించాడు. ఆయన పేరు మొట్టా రాజేంద్రన్ కానీ ఆయన పేరు చెప్తే పెద్దగా గుర్తుపట్టక పోవచ్చు కానీ చూస్తే మాత్రం టక్కున నవ్వేస్తారు. హీరో సూర్య నటించిన సింగం సినిమాలో విలన్ పక్కన ఉండే సహాయం అనే పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆతర్వాత రాజారాణి సినిమాలో హీరో పని చేసే ఆఫీస్ లో బాస్ గా నటించాడు. వీటితో పాటు శివకార్తికేయన్ హీరోగా నటించిన రెమో సినిమాలో నటించాడు రాజేంద్రన్. కమెడియన్ గా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ నటుడి బ్యాగ్రౌండ్ గురించి చాలా మందికి తెలియకపోవొచ్చు. పైకి సింపుల్ గా కనిపిస్తున్న ఆయన.. కోట్ల ఆస్తిపరుడు. కానీ ఆయన ఎన్నో కష్టాలు పడి ఆస్థాయికి వచ్చారు.

రాజేంద్రన్ బక్కగా, గుండుతో నల్లటి ఆకారంతో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు రాజేంద్రన్. అయితే రాజేంద్రన్ కెరీర్ బిగినింగ్ లో స్టంట్‌కు, డూప్‌గా నటించాడు. చాలా సినిమాల్లో ఫైట్ సీన్స్ లో కనిపించాడు రాజేంద్రన్. అయితే 500కు పైగా చిత్రాల్లో స్టంట్ గా వర్క్ చేశాడు. తెలుగు, తమిళ్ సినిమాల్లో ఫైటర్ గా కనిపించాడు. అలాగే పితామగన్ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. ఆతర్వాత నటుడిగా వరుసగా సినిమాలు చేశాడు రాజేంద్రన్.

అయితే రాజేంద్రన్ ఓ సినిమా షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యాడు. చెన్నైలోని కళపేటలోఓ సినిమా షూటింగ్ లో ఓ నటుడిని కొట్టి పక్కనే ఉన్న చెరువులో పడెయ్యాలి. కానీ ఆ చెరువులో రసాయనాలు కలిసున్నాయని తెలియని రాజేంద్రన్ ఆ చెరువులో పడిపోయాడు. అయితే ఆ రసాయనాలు ఉండటంతో.. రాజేంద్రన్ జుట్టు మొత్తం రాలిపోయింది. ఇక భవిషత్తులో జుట్టు రాకుండపోయింది. అలాగే కనుబొమ్మలు కూడా పోయాయి. అలాగే నల్లగా రంగు మారిపోయింది. మొఖం కూడా వింతగా తయారయ్యింది. అలాగే ఆయన రసాయనాలు కలిసిన నీళ్లు కడుపులోకి వెళ్లడంతో ఆయనకు అనేక అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయి. జీర్ణాశయ సమస్యలు కూడా వచ్చాయట. ఆ సమయంలో ఆయన దగ్గర డబ్బులు కూడా లేవట. ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సాయం కూడా చేయలేదట. ఇక ఆ సమస్యలన్నీ దైర్యంగా ఎదుర్కొన్న రాజేంద్రన్ తిరిగి సినిమాల్లో నటించడం మొదలు పెట్టాడు. కమెడియన్ గా, నటుడిగా 160కు పైగా సినిమాల్లో రాజేంద్రన్ నటించాడు. అలాగే ఆయన ఫ్యామిలీ గురించి ఎక్కడ ఎలాంటి అప్డేట్ లేదు. ఇక ఆయనకు ఇప్పుడు చెన్నైలో రూ. 15కోట్ల రూపాయిల ఇల్లు ఉందని తెలుస్తోంది. అలాగే ఆయన దగ్గర మూడు కాస్ట్లీ కార్స్ ఉన్నాయని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.