చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. కట్ చేస్తే ఆయనకే సిస్టర్‌గా.. ఇంతకూ ఈ బ్యూటీ ఎవరో తెలుసా

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో హిట్ అందుకున్న చిరు. ఇప్పుడు కాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేశారు.

చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. కట్ చేస్తే ఆయనకే సిస్టర్‌గా.. ఇంతకూ ఈ బ్యూటీ ఎవరో తెలుసా
Chiranjeevi

Updated on: Nov 09, 2026 | 1:32 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అలాగే మెగాస్టార్ సినిమాల్లో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఇప్పుడు  హీరోలుగా, హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత కాలంలో స్టార్ హీరోలుగా, హీరోయిన్లుగా రాణించిన వారు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు, అరుదైన త్రోబ్యాక్ పిక్స్ నిత్యం నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. మెగాస్టార్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఇప్పుడు హీరోయిన్ గా నటిస్తున్న నటి గురించి తెలుసా.? అలాగే సీరియల్స్‌లోను నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మీ అందరి కోసం ఓ హింట్ కూడ.. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన అద్భుతమైన చిత్రాల్లో ‘పసివాడి ప్రాణం’ ఒకటి. ఈ చిత్రంలో  చిన్న బాబు పాత్రలో నటించిన ఆ పసివాడి అల్లరి, అమాయకత్వం ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే చాలా మంది ఈ సినిమాలో నటించింది అబ్బాయి అనుకుంటారు కానీ.. నిజానికి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఒక అమ్మాయి!

ఆమే బుల్లితెర ప్రముఖ నటి, సుప్రసిద్ధ హీరోయిన్ సుజిత (సుజితా ధనుష్). చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె, ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కీలక పాత్రలు పోషిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ‘పసివాడి ప్రాణం’ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న సుజిత.. సంవత్సరాలు గడిచాక మళ్లీ మెగాస్టార్‌తో కలిసి నటించే అరుదైన అవకాశం దక్కించుకుంది. చిరంజీవి హీరోగా నటించిన ‘జై చిరంజీవ’ చిత్రంలో ఆయనకు చెల్లెలుగా నటించి మెప్పించింది. ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. ‘పసివాడి ప్రాణం’ సినిమా తర్వాత తనకు వరుసగా మరో ఐదారు సినిమాల్లోనూ అబ్బాయి పాత్రలు పోషించే అవకాశాలే వచ్చాయని సుజిత గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రంలో తన నటన తనకు స్పష్టంగా గుర్తులేనప్పటికీ, ప్రేక్షకులు తనని అమితంగా ఆదరించారని తెలిపారు.

కేవలం చిరంజీవితోనే కాకుండా టాలీవుడ్ అగ్ర హీరోలైన వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ సినిమాల్లోనూ బాలనటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆమె నటించారు.
వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా సుజిత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ‘సుందరకాండ’, ‘వదినమ్మ’ వంటి సూపర్ హిట్ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ఇంటింటి మనిషిగా మారారు. ప్రస్తుతం తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో పలు సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉండటమే కాకుండా, వివిధ షోలకు యాంకరింగ్‌ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us