Tollywood: క్రికెటర్ అవ్వాలని.. స్టోర్ మేనేజర్‏గా మారాడు.. కట్‌చేస్తే.. పవర్ ఫుల్ విలన్‏గా తెలుగులో ఫేమస్.. ఎవరంటే?

|

Jul 21, 2024 | 9:26 PM

భాషతో సంబంధం లేకుండా వందల చిత్రాల్లో నటించినప్పటికీ అడియన్స్ కు వారి పేర్లు కూడా గుర్తుండవు. అయినప్పటికీ నటనపై ఆసక్తి ఉండి.. ఇండస్ట్రీలో తమకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు. 90's, 2000 తెలుగుతోపాటు హిందీలోనూ అనేక సినిమాల్లో నటించి అత్యుత్తమ విలన్‌లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న అటువంటి అసాధారణ నటుడు

Tollywood: క్రికెటర్ అవ్వాలని.. స్టోర్ మేనేజర్‏గా మారాడు.. కట్‌చేస్తే.. పవర్ ఫుల్ విలన్‏గా తెలుగులో ఫేమస్.. ఎవరంటే?
Actor
Follow us on

తెరపై విలన్‏గా నటించడం అంటే అంత సులభం కాదు. తమ నటనతో ప్రేక్షకులను భయపెట్టాలంటే అసాధారణమైన నటనా నైపుణ్యాలు చాలా అవసరం. నటీనటుల నటనపై ప్రశంసలు కురిపిస్తుంటారు. కానీ పవర్ ఫుల్ విలన్ పాత్రలలో నటించడం.. తెరపై తమదైన నటనతో ప్రేక్షకులను అలరించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా వందల చిత్రాల్లో నటించినప్పటికీ అడియన్స్ కు వారి పేర్లు కూడా గుర్తుండవు. అయినప్పటికీ నటనపై ఆసక్తి ఉండి.. ఇండస్ట్రీలో తమకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు. 90’s, 2000 తెలుగుతోపాటు హిందీలోనూ అనేక సినిమాల్లో నటించి అత్యుత్తమ విలన్‌లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న అటువంటి అసాధారణ నటుడు ముఖేష్ రిషి. ఒకప్పుడు వరుసగా సినిమాల్లో కనిపించిన ఆయన ఇప్పుడు అంతగా తెరపై సందడి చేయడం లేదు.

ముఖేష్ రిషి.. ఈ పేరు చెబితే ప్రేక్షకులు గుర్తుపట్టలేరు. కానీ ఒక్కడు సినిమాలో మహేష్ బాబు తండ్రిగా.. ఇంద్ర మూవీలో మెగాస్టార్ చిరంజీవిని ఎదురించే విలన్ గా కనిపించి మెప్పించాడు. అలాగే బృందావనం సినిమాలో ఎన్టీఆర్ తండ్రిగా అలరించాడు. తెలుగుతోపాటు హిందీలో అనేక సినిమాల్లో విలన్ గా, సహాయ నటుడిగా కనిపించి అలరించాడు. ముఖేష్ రిషి.. 1956 ఏప్రిల్ 17న జమ్మూలో జన్మించారు. తండ్రి వ్యాపారవేత్త. తన కొడుకు కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలని అనుకున్నాడు. కానీ ముఖేష్ రిషికి చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడడానికే ఆసక్తి చూపించేవాడు. కాలేజీ రోజుల్లో పంజాబ్ విశ్వవిద్యాలయంలో కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. అదే సమయంలో అతడి కుటుంబం ముంబైకి మారింది. అతని తండ్రి అక్కడ వ్యాపారాన్ని స్థాపించాడు. దీంతో ముఖేష్ కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. కానీ తనకు బిజినెస్ ఇంట్రెస్ట్ లేదని.. విదేశాలకు వెళ్లాలని ఉందని చెప్పడంతో స్నేహితుడి ద్వారా ఫిజీకి వెళ్లాడు. అక్కడ ఓ డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో మేనేజర్‌గా పని చేయడం ప్రారంభించాడు.

ముఖేష్ ఉద్యోగంతో పాటు మోడలింగ్ కూడా చేశాడు. అతను మోడలింగ్ చేసే రోజుల్లో, అతను చిత్ర పరిశ్రమలోకి వెళ్లాలని చాలా మంది చెప్పారు. ముఖేష్ తండ్రి మరణించడంతో, అతను ముంబైకి తిరిగి వచ్చాడు. వ్యాపారాలను చూసుకోవాలని అతడి సోదరుడు చెప్పడంతో సినిమాల్లో విలన్ గా నటించాలని ఉందని తన కోరికను చెప్పాడు. ఇందుకు కుటుంబం కూడా ఒప్పుకోవడంతో యాక్టింగ్ స్కూల్‌లో చేరి నటనకు కావాల్సిన నైపుణ్యాలను నేర్చుకున్నాడు. 1993లో విడుదలైన యష్ చోప్రా తెరకెక్కించిన సినిమాలో నటించాడు. తర్వాత టీవీ సీరియల్ టిప్పు సుల్తాన్ లో భయంకరమైన విలన్ పాత్రలో నటించాడు. ఆ తర్వాత అతడికి తెలుగు, హిందీ భాషలలో అనేక సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. కొన్నాళ్లుగా అతడు ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.