Prabhas: ఏంటీ.. ఆ బాలీవుడ్ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశాడా..? సోనాక్షితో డార్లింగ్ డాన్స్.. వీడియో వైరల్..

|

Jun 25, 2024 | 11:08 AM

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు నిరాశపరిచాయి. కానీ గతేడాది డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాతో హిట్టు కొట్టాడు ప్రభాస్. చాలా కాలం తర్వాత మాస్ నట విశ్వరూపంతో సెన్సెషన్ క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు కల్కి 2898 ఏడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ గురువారమే కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్.

Prabhas: ఏంటీ.. ఆ బాలీవుడ్ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశాడా..? సోనాక్షితో డార్లింగ్ డాన్స్.. వీడియో వైరల్..
Prabhas
Follow us on

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బాక్సాఫీస్ కింగ్ అన్న సంగతి తెలిసిందే. సౌత్ టూ నార్త్ డార్లింగ్ కోసం ప్రాణాలిచ్చే అభిమానులు ఉన్నారు. డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాతో డార్లింగ్ ఫాలోయింగ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీలో ప్రభాస్ యాక్టింగ్, లుక్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ముఖ్యంగా నార్త్ అడియన్స్ ప్రభాస్ నటనకు ఫిదా అయిపోయారు. అప్పటినుంచి డార్లింగ్ సినిమాల కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు నిరాశపరిచాయి. కానీ గతేడాది డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాతో హిట్టు కొట్టాడు ప్రభాస్. చాలా కాలం తర్వాత మాస్ నట విశ్వరూపంతో సెన్సెషన్ క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు కల్కి 2898 ఏడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ గురువారమే కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్.

ప్రస్తుతం కల్కి సినిమా బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. ఓవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. అటు మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప మూవీలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్ లో ప్రభాస్ కళ్లను మాత్రమే రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కన్నప్ప కంటే ముందే ప్రభాస్ ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేశాడని తెలుసా.. ? అది కూడా హిందీ సినిమాలో. అవును. అందుకు సంబంధించిన వీడియోను ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ నెట్టింట షేర్ చేస్తున్నారు.

బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ హీరోగా కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తెరకెక్కించిన సినిమా యాక్షన్ జాక్సన్. 2014లో విడుదలైన ఈ మూవీలో అజయ్ ద్విపాత్రాభినయం చేయగా.. సోనాక్షి సిన్హా, యామీ గౌతమ్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో కునాల్ రాయ్ కపూర్, మనస్వి, ఆనందరాజ్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో పంజాబీ మస్త్ అనే పాటలో హీరోయిన్ సోనాక్షి సిన్హాతో కలిసి డాన్స్ చేశాడు ప్రభాస్. ఇప్పుడు ఈ సాంగ్ వీడియోను షేర్ చేస్తూ అప్పట్లోనే ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. మళ్లీ దశాబ్దకాలం తర్వాత కన్నప్ప సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నాడు.

కన్నప్ప సినిమాలో ప్రభాస్ తన పాత్రను ఎంతో ఇష్టంతో ఎంచుకున్నాడట. ఈ విషయాన్ని ఇటీవల హీరో మంచు విష్ణు వెల్లడించాడు. కన్నప్ప సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక మరో రెండు రోజుల్లో అంటే జూన్ 27న కల్కి మూవీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.