Tollywood : ఫస్ట్ టైమ్ రూ. కోటి రెమ్యునరేషన్ తీసుకున్న హీరో ఎవరో తెలుసా ?.. అమితాబ్, షారుఖ్ ఖాన్ కంటే ముందే టాలీవుడ్ స్టార్..

|

Feb 10, 2024 | 9:48 AM

భారతీయ సినీ పరిశ్రమలోనే మొదటిసారిగా ఒకే చిత్రానికి రూ. 1.25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని చరిత్ర సృష్టించాడు. ఒక్క సినిమాకు అంత మొత్తంలో వసూలు చేసిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలోని షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాను అనుకుంటున్నారా ?.. అయితే పొరపాటు పడ్డటే.. అంతేకాదు.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా కాదు.. ఆ హీరో సౌత్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ

Tollywood : ఫస్ట్ టైమ్ రూ. కోటి రెమ్యునరేషన్ తీసుకున్న హీరో ఎవరో తెలుసా ?.. అమితాబ్, షారుఖ్ ఖాన్ కంటే ముందే టాలీవుడ్ స్టార్..
Shah Rukh Khan,amitabh, Sal
Follow us on

టాలెంట్ ఎవరి సొత్తు కాదు.. ప్రతిభ ఉంటే చాలు.. నీ ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాటేయోచ్చు. ఇక సినీ ప్రపంచంలో నటుడిగా ఎదగాలంటే.. అవమానాలు, మరెన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. అలాంటి ఎన్నో అడ్డంకులను ఛేదించి.. స్టార్ హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. నటనపై అతడికున్న ఇష్టం.. సినిమా అంటే తనకున్న ఆసక్తి అతడిని సినీ పరిశ్రమలోనే అగ్రకథానాయకుడిగా నిలబెట్టింది. భారతీయ సినీ పరిశ్రమలోనే మొదటిసారిగా ఒకే చిత్రానికి రూ. 1.25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని చరిత్ర సృష్టించాడు. ఒక్క సినిమాకు అంత మొత్తంలో వసూలు చేసిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలోని షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాను అనుకుంటున్నారా ?.. అయితే పొరపాటు పడ్డటే.. అంతేకాదు.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా కాదు.. ఆ హీరో సౌత్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ మెగాస్టార్ చిరంజీవి.. అవును.. ఒక్కో సినిమాకు రూ. కోటి పారితోషికం అందుకున్న తొలి భారతీయ నటుడు చిరంజీవి.

1992లో వచ్చిన ది వీక్ మ్యాగజైన్ ఫస్ట్ పేజీలో చిరు గురించి ప్రత్యేకంగా పెద్ద ఆర్టికల్ రాశారు. ఆ మ్యాగజైన్ ముందు పేజీలో “బచ్చన్ కంటే పెద్దది” అనే శీర్షికతో చిరు ఫోటోను ప్రచురించారు. తెలుగు “ఆపద్బాంధవుడు” ఎలైట్ లీగ్ లో చేర్చింది. ఆపద్బాంధవుడు కోసం చిరంజీవి తీసుకున్న రెమ్యునరేషన్ రూ. 1 కోటి. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడిగా నిలిచారు చిరు. అప్పట్లో బాక్సాఫీస్ ను ఏలుతున్న అమితాబ్ బచ్చన్ కూడా ఒక్కో సినిమాకు కేవలం రూ. 90 లక్షలు మాత్రమే తీసుకున్నారు. కానీ అంతకు మించి రెమ్యునరేషన్ తీసుకున్నది మాత్రం చిరంజీవినే.

80వ దశకంలో సినీ ప్రయాణం ఆరంభించారు చిరంజీవి. మొదట్లో చిన్న చిన్న పాత్రలు, విలన్ రోల్స్ చేసి మెప్పించాడు. ఆ తర్వాత పునాది రాళ్లు సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి… మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా స్థిరపడ్డాడు. దశాబ్ద కాలంలోనే తెలుగు చిత్రసీమలో నంబర్ వన్ హీరోగా నిలిచాడు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో తక్కువ సమయంలోనే సూప్రీం హీరో, మెగాస్టార్ అనే బిరుదులు అందుకున్నాడు. చిరంజీవి తర్వాత తమిళ్ స్టార్ కమల్ హాసన్ 1994లో ఒక సినిమాకు రూ. కోటి రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఆతర్వాత రజినీ సైతం కోటి క్లబ్ లో చేరారు. 1995లో అమితాబ్ బచ్చన్ ఒక్కో సినిమాకు రూ. కోటి కంటే ఎక్కువ వసూళు చేశారు. ఇక షారుఖ్, సల్మాన్ 1990ల చివరినాటికి ఒక్కో సినిమాకు కోటి తీసుకున్నారు. ఇక వెంకీ, నాగార్జున సైతం అదే సమయంలో కోటి వసూలు చేశారు. ఈ ఏడాది భారత దేశ రెండవ అత్యున్నత గౌరవ పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్నారు చిరు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.