Vineetha: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీ సెకండ్ హీరోయిన్ గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు

|

Jan 26, 2023 | 7:08 AM

సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. వెంకటేష్ సరసన ఈ సినిమాలో సౌందర్య నటించింది. ఈ సినిమాకు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు.

Vineetha: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీ సెకండ్ హీరోయిన్ గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు
Intlo Illalu Vantintlo Priy
Follow us on

విక్టరీ వెంకటేష్ తన కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు. ఇకవెంకీ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించి మెప్పించిన కామెడీ ఎంటర్టైనర్స్ లో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా ఒకటి. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. వెంకటేష్ సరసన ఈ సినిమాలో సౌందర్య నటించింది. ఈ సినిమాకు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తమిళ చిత్రం తైకులమే తైకులమే కు రీమేక్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సౌందర్య తో పాటు నటించిన మరో హీరోయిన్ గుర్తుందా..? ఆమె పేరు వినీత. ఈ సినిమాలో నేపాలీ అమ్మాయిగా నటించింది వినీత.

ఎంతో అందంగా అమాయకంగా కనిపించిన వినీత ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఆమెను చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు సుమ.. వినీత ఎక్కువగా తమిళ్ మలయాళ భాషల్లో సినిమాలు చేసింది. అకాగే తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. మొత్తంగా వినీత 70కు పైగా సినిమాల్లో నటించి అలరించింది.

ఇదిలా ఉంటే వ్యభిచారం అనుమానంతో 2003లో వినీతను పోలీసులు అరెస్టు చేశారు. అయితే 2004లో ఆమె ఏ తప్పూ చేయలేదని తేలింది. ఇక ఆ విచారణ తనను మానసిక వేదనకు గురి చేసిందని గతంలో వినీత పేర్కొంది. ఆమె పేరును కించపరిచేలా పోలీసులు తనపై తప్పుడు కేసు పెట్టారని పేర్కొంది. ఆ తర్వాత 2008లో తక్కువ-బడ్జెట్ డ్రామా ఎంగ రాసి నల్ల రాసిలో సహాయక పాత్రను పోషించింది. ఆ తర్వాత మళ్లీ ఆమె సినిమాల్లో కనిపించలేదు. ఇక ఇప్పుడు ఆమె ఎలా ఉందో తెలుసుకోవడానికి కొందరు ఆమె ఫోటోలను గాలిస్తున్నారు. ఏ క్రమంలోనే ఆమె లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.