Dandupalyam: బాబోయ్..! దండుపాళ్యం హీరోయిన్ ఇప్పుడు చూస్తే నోరెళ్లబెడతారు..

|

Jun 18, 2024 | 3:37 PM

ఈ సినిమాను అంత ఈజీగా మర్చిపోరు. ఈ సినిమాకు శ్రీనివాస్ రాజు దర్శకత్వం వహించారు. 2012లో వచ్చిన ఈ సినిమా కన్నడ భాషలో తెరకెక్కింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ లో పూజా గాంధీ, రవి కాలే, మకరంద్ దేశ్‌పాండే, పి. రవిశంకర్ అలాగే రఘు ముఖర్జీ నటించారు. 'దండుపాళ్య' అనే పేరుమోసిన ముఠా నిజ జీవితంలోని దోపిడీల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

Dandupalyam: బాబోయ్..! దండుపాళ్యం హీరోయిన్ ఇప్పుడు చూస్తే నోరెళ్లబెడతారు..
Dandupalya
Follow us on

ఇప్పటివరకు ఇండస్ట్రీలో చాలా రకాల సినిమాలు వచ్చాయి. కాగా ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న సినిమాల్లో క్రైం థ్రిల్లర్ సినిమాలు ఎక్కువనే చెప్పాలి. థ్రిల్లర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పటికే చాలా రకాల క్రైమ్ థ్రిల్లర్లు ప్రేక్షకులను మెప్పించాయి. అలాంటి వాటిలో దండుపాళ్యం సినిమా ఒకటి. ఈ సినిమాను అంత ఈజీగా మర్చిపోరు. ఈ సినిమాకు శ్రీనివాస్ రాజు దర్శకత్వం వహించారు. 2012లో వచ్చిన ఈ సినిమా కన్నడ భాషలో తెరకెక్కింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ లో పూజా గాంధీ, రవి కాలే, మకరంద్ దేశ్‌పాండే, పి. రవిశంకర్ అలాగే రఘు ముఖర్జీ నటించారు. ‘దండుపాళ్య’ అనే పేరుమోసిన ముఠా నిజ జీవితంలోని దోపిడీల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

ఈ చిత్రం 2012 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచి, పలు కేంద్రాలలో 100 రోజులకు పైగా ఆడింది ఈ సినిమా. అలాగే తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేశారు. పూజా ప్రధాన పాత్రలో, కన్నడ సినీ పరిశ్రమలో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన మహిళా ప్రధాన చిత్రంగా నిలిచింది దండుపాళ్యం. ఈ చిత్రం దండుపాళ్యం ఫ్రాంచైజీలో మొదటి భాగం. దండుపాళ్యం 2 చిత్రానికి సీక్వెల్, జూలై 2014లో వచ్చింది. ఈ సినిమాలోనూ  పూజా గాంధీ ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత దండుపాళ్యం 3 వచ్చింది. ఆతర్వాత కె.టి.నాయక్ దర్శకత్వం వహించిన దండుపాళ్య 4  2019లో విడుదలైంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన పూజా గాంధీ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

బోల్డ్ గా నటిస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ అమ్మడు. ఈ చిన్నదాని నటన ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టింది. హిందీతో పాటు కన్నడ, తమిళ, తెలుగు భాషా సినిమాల్లో నటించింది పూజా. ఎక్కువగా కన్నడ భాషలో సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. 2021 తర్వాత ఆమె సినిమాలకు దూరం అయ్యింది. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది పూజా గాంధీ. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది పూజాగాంధీ. సినిమాల తర్వాత రాజకీయాల వైపు కూడా అడుగులేసింది పూజాగాంధీ. 2012లో జనతాదళ్  పార్టీలో చేరి, వెంటనే కేజేపీ పార్టీలోకి ఆ తరువాత బి.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇక ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉందో చూడండి.

పూజా గాంధీ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.