ఐస్ ల్యాండ్‌లో ‘డిస్కోరాజా’..టీవీ9 ఎక్స్‌క్లూజివ్ విజువల్స్..!

|

Oct 16, 2019 | 2:05 AM

మాస్ మహారాజ రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘డిస్కో రాజా’. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్కక్షణం’ వంటి వినూత్నకాన్సెప్ట్స్‌తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించిన దర్శకుడు వీ ఐ ఆనంద్.. మాస్ రాజాతో మరో సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు. రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల వినాయక చవితి కానుకగా రిలీజ్ అయి ప్రేక్షకులను […]

ఐస్ ల్యాండ్‌లో డిస్కోరాజా..టీవీ9 ఎక్స్‌క్లూజివ్ విజువల్స్..!
Follow us on

మాస్ మహారాజ రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘డిస్కో రాజా’. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్కక్షణం’ వంటి వినూత్నకాన్సెప్ట్స్‌తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించిన దర్శకుడు వీ ఐ ఆనంద్.. మాస్ రాజాతో మరో సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు. రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల వినాయక చవితి కానుకగా రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ లుక్‌లో మాస్ రాజా నయా అవతార్‌తో మెస్మరైజ్ చేశాడు.

ఇక ప్రస్తుతం ఈ సినిమా తాజా షెడ్యూల్ ఐస్ ల్యాండ్‌లో జరుగుతుంది. వారంరోజుల పాటు అక్కడే షూటింగ్ జరుపుకోనుంది ‘డిస్కో రాజా’. అక్కడి లార్జెస్ట్ ఐ స్కాప్ లాంగ్ జోకల్‌లో మూవీ టీం తెగ సందడి చేసింది. పూర్తిగా మంచుతో కప్పబడిన వెస్ట్ ఐస్ ల్యాండ్‌లో చాలా రిస్కీ షాట్స్ షూట్ చేశారు. దీనికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ పుటేజ్‌ను టీవీ9 సంపాదించింది.

ఐస్ ల్యాండ్‌లో రియలిస్టిక్ గ్లేసియర్స్‌లో 3 కిలో మీటర్ల లోపలికి ట్రావెట్ చేసింది డిస్కో రాజా టీం. ఈ హిమనీనదాల్లో 580 మీటర్ల మందాన పేరుకుపోయి ఉంటుంది మంచు. ఇక్కడ తీసిన షాట్స్ రవితేజ్‌లోని మాస్ పవర్‌ని మరోసారి ఎలివేట్ చేస్తాయట. ఇవి ప్రేక్షకులను ఓ రేంజ్‌లో అలరిస్తాయని చెప్తున్నారు నిర్మాత రామ్ తాళ్ళూరి.  ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో బాబీ సింహా, వెన్నెల కిషోర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కాగా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి సినిమాను డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.