రెండు కొత్త సినిమాల టైటిళ్లనూ, హీరోలనూ ప్రకటించిన డైరెక్టర్ తేజ!

| Edited By:

Feb 22, 2020 | 4:45 PM

ఈ సినిమాల కోసం ఆయన 'రాక్షస రాజు రావణాసురుడు', 'అలిమేలు మంగ వెంకట రమణ' అనే ఆసక్తికర టైటిళ్లను రిజిస్టర్ చేయించారు. అయితే, ఆసక్తికరమైన విషయమేమంటే, హీరోలు సహా ఎవరి పేర్లనూ ప్రస్తావించకుండా..

రెండు కొత్త సినిమాల టైటిళ్లనూ, హీరోలనూ ప్రకటించిన డైరెక్టర్ తేజ!
Follow us on

డైరెక్టర్ తేజ తన 54వ పుట్టిన రోజున సందర్భంగా  ఆయన తన తదుపరి రెండు సినిమాల టైటిళ్లనూ, ఇద్దరి హీరోలనూ శనివారం ట్విట్టర్‌ ద్వారా  ప్రకటించారు. ఒక మూవీలో గోపీచంద్, మరో సినిమాలో రానా హీరోలుగా నటించనున్నారు.

ఈ సినిమాల కోసం ఆయన ‘రాక్షస రాజు రావణాసురుడు’, ‘అలిమేలు మంగ వెంకట రమణ’ అనే ఆసక్తికర టైటిళ్లను రిజిస్టర్ చేయించారు. అయితే, ఆసక్తికరమైన విషయమేమంటే, హీరోలు సహా ఎవరి పేర్లనూ ప్రస్తావించకుండా ఈ సినిమాల పోస్టర్లను తేజ విడుదల చేశారు. దాంతో రానాతో చేసే మూవీ ఏది? గోపీచంద్ నటించే సినిమా ఏది?.. అనే విషయాన్ని ఆయన ప్రస్తుతానికి సస్పెన్సులో ఉంచారు. అయితే ‘రాక్షస రాజు రావణాసురుడు’ టైటిల్ రానా కోసమని, ‘అలిమేలు మంగ వెంకట రమణ’ టైటిలేమో గోపిచంద్‌ కోసమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఏ టైటిల్‌కి ఏ హీరోని పరిచయం చేస్తారో..

ఈ సినిమాల నిర్మాతలనూ, వాటిలో నటించే తారాగణాన్నీ త్వరలోనే తేజ ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆయన ఈ సినిమాల స్క్రిప్టుల్ని పూర్తి చేశారు. ‘జయం’ చిత్రంతో గోపీచంద్ కు పెద్ద బ్రేక్ ఇచ్చిన తేజ, ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో రానాకు మరపురాని హిట్ ను అందించిన విషయం గమనార్హం.