Rajamouli: బాహుబలి సినిమా వివాదం పై స్పందించిన రాజమౌళి.. ఏమన్నారంటే..

|

Aug 04, 2024 | 10:03 AM

ఇప్పుడు రాజమౌళి ఇండియాలోనే టాప్ దర్శకుడు.. రాజమౌళి సినిమాలు ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా సూపర్ హిట్ అవుతాయి. ఇటీవలి సంవత్సరాలలో ఇండియన్ సినిమాను ముఖ్యంగా తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత రాజమౌళికి దక్కుతుంది. అయితే రాజమౌళిపై కూడా విమర్శలు తప్పలేదు. ఆయన బ్లాక్ బస్టర్ మూవీ 'బాహుబలి'లోని కొన్ని సన్నివేశాల గురించి కొందరు వివాదం లేవనెత్తారు.

Rajamouli: బాహుబలి సినిమా వివాదం పై స్పందించిన రాజమౌళి.. ఏమన్నారంటే..
Bahubali
Follow us on

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఎలాంటి ఎంత పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఇప్పుడు రాజమౌళి ఇండియాలోనే టాప్ దర్శకుడు.. రాజమౌళి సినిమాలు ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా సూపర్ హిట్ అవుతాయి. ఇటీవలి సంవత్సరాలలో ఇండియన్ సినిమాను ముఖ్యంగా తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత రాజమౌళికి దక్కుతుంది. అయితే రాజమౌళిపై కూడా విమర్శలు తప్పలేదు. ఆయన బ్లాక్ బస్టర్ మూవీ ‘బాహుబలి’లోని కొన్ని సన్నివేశాల గురించి కొందరు వివాదం లేవనెత్తారు. ఈ విషయం పై దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు తెలిపాడు.

‘బాహుబలి’ సినిమా పార్ట్ 1లో తమన్నాను వెతుక్కుంటూ ప్రభాస్ భారీ జలపాతం మీదుగా మరో రాజ్యానికి వెళ్తాడు. అక్కడ తమన్నాను చూసి షాక్ అవుతాడు. అయితే ఆమె ప్రభాస్ ఊహించినట్టు ఉండదు. తమన్నా అక్కడ స్త్రీత్వం మరిచిపోయిన యోధురాలుగా కనిపిస్తుంది. కానీ ప్రభాస్ ఒక పాటతో తమన్నా అమ్మాయి అని మళ్లీ గుర్తు చేశాడు. అయితే ఆ సీన్‌లో తమన్నా అనుమతి లేకుండా ప్రభాస్ బలవంతంగా ఆమెను తాకుతాడు. దీని పై విమర్శలు వచ్చాయి. తమన్నా అనుమతి లేకుండానే ప్రభాస్ పాత్ర ఆమెను బలవంతపెట్టడం పై విమర్శలు వచ్చాయి.

తన డాక్యుమెంటరీలోని ఆరోపణపై రాజమౌళి స్పందిస్తూ, తమన్నాకు అదంతా (విప్లవం, యుద్ధం) ఇష్టం లేదని ప్రభాస్ పాత్ర తెలుసుకుంటాడు. ఎందుకంటే సాంగ్ కంటే ముందు తమన్నా చిరాకుతో నదిలో ఆమె ముఖం వైపు చూస్తూ ఉండటం ప్రభాస్ చూస్తాడు. అలాగే మొదటిసారి ప్రభాస్, తమన్నా పాత్రలు ముఖాముఖిగా వచ్చినప్పుడు. తమన్నా తన కత్తిని ప్రభాస్ ఛాతీపై ఉంచుతుంది. అప్పుడు ప్రభాస్ దానిపై స్పందించిన విధానం చూస్తే.. అర్ధమవుతుంది. అంతకు మించి విమర్శించే వారికి చెప్పడానికి ఏముంది అని అన్నారు. ఇండియన్ సినిమాల చరిత్రలో అత్యుత్తమ చిత్రాల్లో ‘బాహుబలి’ ఒకటి. ఆ సినిమాకు ముందు ఇంత భారీ బడ్జెట్‌తో సినిమా చేయలేదు. పైగా ఆ సినిమాలు అంత భారీ వసూళ్లు రాబట్టిన సినిమాలు లేవు. రాజమౌళి సినిమాల గురించి నెట్‌ఫ్లిక్స్‌లో ఒక డాక్యుమెంటరీ విడుదల చేశారు. ఆ డాక్యుమెంటరీలో రాజమౌళి ఇలా ‘బాహుబలి’ సినిమా గురించి మాట్లాడారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.